Site icon NTV Telugu

Horror:దారుణం.. భార్యను సుత్తెతో కొట్టి హత్య.. ఆపై భర్త కూడా…

Untitled Design (3)

Untitled Design (3)

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను సుత్తితో కొట్టి హత్య చేశాడు. అనంతరం తాను ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Read Also: Viral Video: మీరెక్కడి మనుషులురా బాబు.. తినే తిండి మీద ఊయమేంట్రా..

గంగాఘాట్ పీఎస్ పరిధి లాల్తఖేడ గ్రామంలో రాజేష్ అనే వ్యక్తి తన భార్య సీమా లోధిని తలపై సుత్తితో కొట్టి హత్య చేశాడు. అనంతరం భార్య హత్య విషయం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపు నిందితుడు అక్కడ కనిపించలేదు.ఈ సంఘటన గురించి తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని గొడవ చేశారు. పోలీసులు నిందితుడైన భర్త , అతని అత్తమామలతో సహా ఆరుగురిపై వరకట్నం, హత్య కేసు నమోదు చేశారు. అత్తమామలను అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే నిందితుడు మాత్రం కనిపించలేదు. దీంతో అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

Read Also: Types of Anesthesia: అసలు అనస్థీషియా ఎందుకు ఇస్తారు.. ఎప్పుడు ఇస్తారో మీకు తెలుసా?

అక్టోబర్ 16న, లాల్తఖేడ గ్రామంలోని అడవిలోని పొదలలోని చెట్టుకు వేలాడుతూ రాజేష్ లోధి మృతదేహం కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపారు. ఈ హత్య వరకట్నం కోసం కాకపోవచ్చని.. వేరే ఇతర కారాణాలు అయ్యి ఉండవచ్చని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజేష్‌కు ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారు.

Read Also: Slaps Biker: సార్ మీరు.. రక్షక భటులా.. భక్షక భటులా..

ఈ కేసులో పోలీసులు సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నారని సిఓ సదర్ దీపక్ యాదవ్ తెలిపారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఏరియా ఆసుపత్రికి తరలించామని తెలిపారు. రిపోర్ట్ రాగానే.. పూర్తి విషయాలు వెల్లడిస్తామన్నారు.

Exit mobile version