NTV Telugu Site icon

UP: 7 రోజులు బంధించి, 23 మంది సామూహిక అత్యాచారం.. ఇంటర్ విద్యార్థినిపై దారుణం..

Gang Rape

Gang Rape

UP: తనపై 20 మందికి పైగా వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారని ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఆరోపించడం సంచలనంగా మారింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలో జరిగింది. యూపీ పోలీసులు 23 మంది పురుషులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిలో 11 మంది గుర్తు తెలియని వారు ఉన్నారు. ఇప్పటి వరకు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మార్చి 29న వారణాసిలోని పిషాచ్‌మోచన్ ప్రాంతంలోని హుక్కా బార్‌కు తన స్నేహితుడితో అమ్మాయి వెళ్లింది. ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయింది. బాధితురాలు స్పోర్ట్స్ కోర్సులో ఎంట్రీకి సిద్ధమవుతోంది. ఆమె రన్నింగ్ ప్రాక్టీస్ కోసం క్రమం తప్పకుండా యూపీ కాలేజీకి వెళ్తోంది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం, ‘‘మార్చి 29న ఒక స్నేహితుడితో కలిసి పిషాచ్‌మోచన్ ప్రాంతంలోని హుక్కా బార్‌కి వెళ్లింది. అక్కడ ఇంకొంత మంది కూడా చేరారు. కూల్ డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి, ఆపై సిగ్రా ప్రాంతంలోని వేర్వేరు హోటర్లకు తీసుకెళ్లి, ఆమెపై అక్కడ సామూహిక అత్యాచారం చేసినట్లు ఆరోపించింది’’ అని సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు.

Read Also: Microsoft: ‘‘మీకెంత ధైర్యం?’’.. మైక్రోసాఫ్ట్ బాస్‌లపై భారత సంతతి టెక్కీ ఆగ్రహం.. కారణం ఇదే..

నిందితుల్లో కొందరు ఆమెకు తెలిసిన వారు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ నుంచి వీరు పరిచయం, కొందరు మాజీ క్లాస్‌మేట్స్ కూడా ఉన్నారు. బాలిక కుటుంబం నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు, పోలీసులు ఆమెను గుర్తించి, హుక్కా బార్ సిబ్బందిని ప్రశ్నించడం ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఆ ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నారు.

డీసీపీ వరణ జోన్ చంద్ర కాంత్ మీనా ప్రకారం.. ఆ అమ్మాయి మొదట తన ఇష్టపూర్వకంగానే స్నేహితుడితో వెళ్లిందని, ఏప్రిల్ 4న ఆమె కుటుంబ మిస్సింగ్ కేసు ఫైల్ చేశారని, అదే రోజు ఆమెను కనుగొన్నామని వెల్లడించారు. ఆ సమయంలో ఆమె లేదా ఆమె కుటుంబ సభ్యులు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిపారు. మార్చి 29- ఏప్రిల్ 04 మధ్య సామూహికి అత్యాచారం జరిగినట్లు ఆరోపిస్తున్న కేసుపై ఏప్రిల్ 6న లాల్ పూర్ పోలీస్ స్టేషన్‌ ఫిర్యాదు నమోదైంది. ఈ కేసులో సదరు బాధితురాలు మైనర్ కాదని డీసీపీ మీనా స్పష్టం చేశారు.