ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఫిట్ నెస్ కోడలు రోజు జిమ్ కు వెళుతుంది. వెళ్లేటపుడు మాత్రం ఆభరణాలు అన్ని వేసుకుని వెళుతుంది. ఇది నచ్చని అత్త ఆ నగలు కొట్టేసేందుకు ప్లాన్ చేసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే…. ముజఫర్‌నగర్ జిల్లాలోని పుర్కాజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొహమ్మద్‌పూర్ గ్రామంలో పూజా అనే మహిళ జిమ్ కు ఆభరణాలు పెట్టుకుని వెళ్లింది. ఆమె అత్త రేఖకు ఇది నచ్చలేదు. జిమ్ కు వెళ్లే అలవాటు పట్ల ఆమె అత్త రేఖ అసంతృప్తి చెందింది. ఎంత చెప్పినా వినకపోవడంతో.. ఆమె నగలు కాజేయాలని కుట్ర పన్నింది.
ముజఫర్ నగర్ లోని మొహమ్మద్ పూర్ గ్రామంలో, కోడలు పూజ జిమ్ కు వెళ్లే అలవాట్లు సంచలనం సృష్టించాయి. తన కోడలు ఆధునిక ఆభరణాలు ధరించి జిమ్ కు వెళ్లే అలవాటు పట్ల ఆమె అత్త రేఖ చాలా కోపంగా ఉంది. దీంతో అంకుర్ అలియాస్ కాశీని సంప్రదించి.. తన కోడలు నగలు లాక్కోవడానికి అతనికి డీల్ ఇచ్చింది. అంకుర్ తన అసిస్టెంట్ లు వంశ్ , వీర్ సింగ్‌లను కలిసి ఆమె నగలను ఎత్తుకెళ్లారు. వెంటనే కోడలు పూజా చోరీపై పీఎస్ లో కంప్లైంట్ చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 12 గంటల్లోనే, పోలీసులు ముగ్గురు నేరస్థులను అరెస్టు చేసి, నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పూజ అత్తగారైన రేఖ తమకు ఈ పని అప్పగించిందని తెలిపారు.