నిందితుడిని వివాహం చేసుకోవడానికి నిరాకరించినందుకు 17 ఏళ్ల బాలికను మూడు రోజుల పాటు నిర్బంధంలో ఉంచి, అత్యాచారం చేసి హింసించాడు ఓ కిరాతకుడు. దీనితో పోలీసులు 22 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేసి ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ లోని జైలుకు పంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం., బాధితురాలిని వేధింపులకు గురిచేసి, నిందితుడు ఇనుప రాడ్ ను ఉపయోగించి ఆమె ముఖం మీద తన పేరు ‘అమాన్’ అని వ్రాసాడు. ఈ కేసులో మొదట్లో, తప్పుడు నిర్బంధం, గాయపరచడం వంటి ‘తక్కువ’ సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడిందని కుటుంబం పేర్కొంది. అయితే, ఆ తరువాత బాధితురాలి వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేసినప్పుడు., పోక్సో చట్టంతో పాటు సెక్షన్ 164 సిఆర్పిసి ఎఫ్ఐఆర్ కు జత చేసారు.
Also Read: Stock Markets: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్స్.. లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్ల మొగ్గు..
ఆమె కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలిక చెప్పిన వీడియో స్టేట్మెంట్ రికార్డ్ చేయబడింది. అయితే, మొదట ఆమె అలాంటి తీవ్రమైన ఆరోపణలు చేయలేదని ఎస్ఎస్పి (ఖేరి) గణేష్ షా తెలిపారు. కోర్టులో ఆమె తన వాంగ్మూలాన్ని ఎందుకు మార్చుకున్నారో మాకు తెలియదు. కానీ, కొత్త ఆరోపణల ప్రకారం.. మళ్లీ దర్యాప్తు మొదలుపెట్టమని., నిందితుడిని అరెస్టు చేశాం ” అని తెలిపారు. ఎస్హెచ్ఓ (ధౌరహ్రా) దినేష్ సింగ్ చెప్పిన దాని ప్రకారం., నిందితుడు పాఠశాల డ్రాపౌట్ అని, హైదరాబాద్ లోని ఒక సెలూన్లో పనిచేసేవాడని తెలిపారు. అతను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలిని అనుకున్నాడని, కానీ ఆమె అతని ప్రతిపాదనను తిరస్కరించడంతో, అతను ఇనుప రాడ్ ను ఉపయోగించి ఆమె రెండు చెంపలపై తన పేరును వ్రాసాడని సింగ్ తెలిపారు.
Also Read: Panipuri 333: ఇలా ఐతే కష్టమే బ్రో.. ఒక్క ప్లేట్ పానీపూరి రూ. 333.. ఎక్కడంటే..
ఆమె తన కుటుంబంతో కలిసి పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. మొదట్లో, ఆమె ఐడి లేనందున ఆమె వయస్సును ధృవీకరించలేకపోయామని సింగ్ చెప్పారు. మేము ఇప్పుడు పోక్సో చట్టంతో పాటు ఐపిసి సెక్షన్లు 324 మరియు 376 (అత్యాచారం) ను జోడించామని దినేష్ సింగ్ తెలిపారు.