Man stabs wife: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. మధ్యాహ్న భోజనం ఆలస్యమైందని ఓ వ్యక్తి భార్యను కిరాతకంగా పొడిచి చంపాడు. 30 ఏళ్ల పరస్రామ్,28 ఏళ్ల తన భార్య ప్రేమాదేవీని చంపేశాడు. రాష్ట్రంలోని సీతాపూర్‌లో థాంగావ్ పోలీస్ స్టేషన్‌లో పరిధిలోని కొత్వలన్‌పూర్వా గ్రామంలో ఈ ఘటన జరిగింది.
Read Also: Election effect: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా.. కొత్త తేదీలివే!
పరస్రామ్ సోమవారం మధ్యాహ్నం పొలాల్లో పని చేసి ఇంటికి తిరిగి వచ్చారు. ఆ సమయంలో భోజనం వడ్డించాలని భార్య ప్రేమను కోరాడు. అయితే, ఆహారం రెడీ కాలేదని చెప్పడంతో ఇద్దరి మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. కోపంతో పరస్రామ్, ప్రేమను పదునైన ఆయుధంతో పదేపదే దాడి చేసి హతమార్చాడని, ఆ తర్వాత తాను కూడా ఇంటికి తాళవ వేసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు థాంగావ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ హనుమంత్ లాల్ తివారీ తెలిపారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలించారు.