Uttar Pradesh: పెళ్లి ఆగిపోయిందని.. అమ్మాయి తల్లి, సోదరుడిని హత్య చేసిన వ్యక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి పెళ్లి ఆగిపోయిందని దారుణానికి పాల్పడ్డాడు. తాను పెళ్లి చేసుకోవాలని అనుకున్న అమ్మాయి తల్లిని, సోదరుడిని కాల్చి చంపినట్లు శనివారం పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన రాష్ట్రంలోని ఇజ్జత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. నిందితుడిని అసిహాబాద్‌కి చెందిన సంజీవ్ కుమార్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉండగా..పోలీసులు వెతుకుతున్నట్లు తెలిపారు.
Read Also: Mars: అంగారకుడిపైన ఒకప్పుడు పెద్ద సరస్సు ఉండేది.. నాసా రోవర్ కీలక ఆధారాలు..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
అహ్లాద్‌పూర్ పోలీస్ పోస్టుకు 500 మీటర్ల దూరంలో నైనిటాల్ హైవేపై అమ్మాయి తల్లి మీనా(55), ఆమె కుమారుడు నేత్రపాల్(21)ని నిందితుడు సంజీవ్ కుమార్ కాల్చి చంపాడు. రోడ్డు పక్కనే మృతదేహాలు పడి ఉన్నాయి. మీనా కుమార్తెతో సంజీవ్ కుమార్ వివాహం నిశ్చయమైంంది. అయితే, ఆ తర్వాత ఈ వివాహం రద్దైందని ఎస్పీ రాహుల్ భాటి తెలిపారు. మీనా భర్త భూప్ రామ్ ఫిర్యాదు మేరకు సంజీవ్ కుమార్‌పై ఫిర్యాదు చేశారు. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎస్పీ తెలిపారు.
తన కుమార్తె పెళ్లిని సంజీవ్ కుమార్‌తో నిశ్చయించుకున్నామని, అయితే, అతని తప్పుడు ప్రవర్తన కారణంగా రద్దు చేసుకున్నామని రామ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో తన పెళ్లి ఆగిపోవడానికి కారణమయ్యారని మీనా, నేత్రపాల్‌ని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
తాజావార్తలు
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!