Site icon NTV Telugu

Uttar Pradesh: పెళ్లి ఆగిపోయిందని.. అమ్మాయి తల్లి, సోదరుడిని హత్య చేసిన వ్యక్తి..

Gun Fire

Gun Fire

Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి పెళ్లి ఆగిపోయిందని దారుణానికి పాల్పడ్డాడు. తాను పెళ్లి చేసుకోవాలని అనుకున్న అమ్మాయి తల్లిని, సోదరుడిని కాల్చి చంపినట్లు శనివారం పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన రాష్ట్రంలోని ఇజ్జత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. నిందితుడిని అసిహాబాద్‌కి చెందిన సంజీవ్ కుమార్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉండగా..పోలీసులు వెతుకుతున్నట్లు తెలిపారు.

Read Also: Mars: అంగారకుడిపైన ఒకప్పుడు పెద్ద సరస్సు ఉండేది.. నాసా రోవర్ కీలక ఆధారాలు..

అహ్లాద్‌పూర్ పోలీస్ పోస్టుకు 500 మీటర్ల దూరంలో నైనిటాల్ హైవేపై అమ్మాయి తల్లి మీనా(55), ఆమె కుమారుడు నేత్రపాల్(21)ని నిందితుడు సంజీవ్ కుమార్ కాల్చి చంపాడు. రోడ్డు పక్కనే మృతదేహాలు పడి ఉన్నాయి. మీనా కుమార్తెతో సంజీవ్ కుమార్ వివాహం నిశ్చయమైంంది. అయితే, ఆ తర్వాత ఈ వివాహం రద్దైందని ఎస్పీ రాహుల్ భాటి తెలిపారు. మీనా భర్త భూప్ రామ్ ఫిర్యాదు మేరకు సంజీవ్ కుమార్‌పై ఫిర్యాదు చేశారు. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎస్పీ తెలిపారు.

తన కుమార్తె పెళ్లిని సంజీవ్ కుమార్‌తో నిశ్చయించుకున్నామని, అయితే, అతని తప్పుడు ప్రవర్తన కారణంగా రద్దు చేసుకున్నామని రామ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో తన పెళ్లి ఆగిపోవడానికి కారణమయ్యారని మీనా, నేత్రపాల్‌ని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Exit mobile version