Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రపోజ్ చేస్తే ఒప్పుకోలేదని మహిళను ఓ వ్యక్తి గొడ్డలితో నరికి హత్య చేశాడు. కాన్పూర్‌లోని రాణా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. 26 ఏళ్ల వ్యక్తి తన పొరుగును ఉండే మహిళను నరికి చంపి, ఆ తర్వాత విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిల్హోర్‌లోని గదన్‌పూర్ ఆహర్‌కి చెందిన సురేష్ అలియాస్ కరణ్ ప్రతిపాదనను బాధిత మహిళ 21 ఏళ్ల షాన్నో కశ్యప్ ఒప్పులేదు. దీంతో రాణా గ్రామం వెలుపల ఉన్న ఫ్లై ఓవర్ సమీపంలో సురేష్ దాడికి పాల్పడ్డాదని డీసీపీ విజయ్ ధుల్ తెలిపారు.
Read Also: Siddha Ramaiah: బీఆర్ఎస్, బీజేపీ బొమ్మ బొరుసు లాంటివి..
షన్నో తన బంధువులతో బైక్ పై వెళ్తున్న సమయంలో అడ్డగించి, వారు తేరుకోకముందే ఆమెను గొడ్డలితో తల, మెడపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె అక్కడిక్కడే మరణించింది. అక్కడి నుంచి పారిపోయిన నిందితుడి కోసం పోలీసులు గాలించగా.. కొన్ని గంటల తర్వాత 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గగన్‌పూర్ ఆహర్‌లోని మారుమూల ప్రదేశంలో సురేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అతని నోటి చుట్టూ నురగలు ఉంటడంతో విషం తాగాడని, సమీపంలోని లాలా లజపతిరాయ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స తీసుకుంటుండగానే సురేష్ మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే హత్యకు స్పష్టమైన కారణాలను తెలుసుకునేందుకు మరింత విచారణ జరపాలని అధికారులు తెలిపారు.
