NTV Telugu Site icon

Shocking: బిడ్డ లింగ నిర్ధారణ కోసం భార్య కడుపు చీల్చిన కసాయి భర్త..

Up

Up

Shocking: ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ వ్యక్తి కసాయిలా ప్రవర్తించాడు. తనకు పుట్టబోయే బిడ్డ మగ పిల్లాడా, ఆడ పిల్ల అని లింగ నిర్ధారణ చేసేందుకు గర్భిణి అయిన భార్య కడుపును చీల్చాడు. ఈ ఘటన యూపీలోని బదౌన్‌లో 2020లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. బదౌన్‌లోని సివిల్ లైన్స్‌లో నివాసం ఉంటున్న పన్నాలాల్ 2020 సెప్టెంబర్ నెలలో తన భార్య కడుపును కొడవలితో కోశాడు.

ఈ జంటకు 22 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి అప్పటికే ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. అయితే, పన్నాలాల్ తనకు మగబిడ్డ పుట్టాలని తరుచూ భార్యతో గొడవ పడేవాడు. దంపతుల గొడవ గురించి భార్య అనిత కుటుంబానికి తెలిసి, పన్నాలాల్‌ని ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ అతను అతనిత విడాకులు ఇచ్చి, వేరే మహిళను పెళ్లి చేసుకుంటానని బెదిరించాడు.

Read Also: Laila Khan Murder Case: బాలీవుడ్ నటి లైలా ఖాన్ హత్య కేసు.. సవతి తండ్రికి మరణశిక్ష విధించిన కోర్టు..

ఈ ఘటన జరిగిన రోజున భార్యభర్తలు మళ్లీ పుట్టబోయే బిడ్డ విషయంలో గొడవ పడ్డారు. కోపంతో ఊగిపోయిన పన్నాలాల్ అనిత కడుపును కోసి మగపిల్లాడా, ఆడ పిల్లా అని ఆమె కడుపును కోశాడు. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, పన్నాలాల్ ఆమె కడుపును కొడవలిలో కోసి తెరిచాడు. ఆ సమయంలో అనిత ఏడు నెలల గర్భిణి. చాలా లోతుగా గాయం చేశాడని, కడుపులోని పేగులు బయటకు వచ్చాయని అనిత కోర్టుకు తెలిపింది.

ఈ ఘటన జరిగిన సమయంలో ఆమె గాయాలతో అరుస్తూ బయటకు పరిగెత్తింది. సమీపంలో దుకాణంలో పనిచేసే ఆమె సోదరుడు ఆమె అరుపులు విని వచ్చే సమయానికి పన్నాలాల్ అక్కడి నుంచి పారిపోయాడు. అనితను ఆస్పత్రికి తరలించారు. ఆమె దాడి నుంచి బయటపడగా.. గర్భంలోని ‘‘మగ శిశువు’’ని మాత్రం రక్షించలేకపోయారు. మరోవైపు తన సోదరులతో ఆస్తి తగాదా ఉన్నందుకు తనపై తప్పుడు కేసు పెట్టేందుకు అనిత తనపై తానే దాడి చేసుకుందని పన్నాలాల్ కోర్టులో వాదించాడు.

Show comments