Site icon NTV Telugu

Man Kills Mother: భూమిని ఇవ్వడం లేదని తల్లి తలనరికి చంపిన కసాయి..

Up

Up

Man Kills Mother: మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. డబ్బు, భూమి ఇలా కొన్నింటి కోసం సొంతవారినే చంపేస్తున్నారు. కనిపెంచిన తల్లిదండ్రుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా యూపీలో ఓ వక్యి తల్లిని దారుణంగా హత్య చేశారు. భూ వివాదం నేపథ్యంలో ఈ హత్య చోటు చేసుకుంది. సీతాపూర్‌కి చెందిన వ్యక్తి, భూమిని తన పేరుపై మార్చకపోవడంతో తల్లి తలనరికి చంపాడు.

Read Also: Soumya Vishwanathan: సౌమ్య విశ్వనాథన్ హంతకులకు జీవిత ఖైదు.. కూతురికి న్యాయం జరిగిన కొన్ని రోజులకే తండ్రి మరణం..

ఈ ఘటన తాల్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెజాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. దినేష్ పాసీ(35), తన తల్లి కమలాదేవీ(65)ని వ్యవసాయ బ్లేడ్‌తో తల నరికి చంపాడాని సీతాపూర్ ఎస్పీ చక్రేష్ మిశ్రా తెలిపారు. నిందితుడి ఇంటి వెలుపల తల లేని మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకి పంపామని, నిందితుడు పరారీలో ఉన్నాడని ఆయన చెప్పారు. మద్యానికి బానిసైన దినేష్ పాసీ, ల్యాండ్‌ని తన పేరుపై రాయాలని కోరాడు, అందుకు తల్లి కమలా దేవీ నిరాకరించడంతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు వెతుకుతున్నారు.

Exit mobile version