UP Horror: ఉత్తర్ ప్రదేశ్ పిలిభిత్ జిల్లాలో అబార్షన్ మాత్రలు వేసుకునేందు నిరాకరించినందుకు ఓ యువకుడు గర్భిణిగా ఉన్న మహిళకు యాసిడ్ తాగించాడు. దాదాపుగా నెలన్నర పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన సదరు మహిళ చివరకు మరణించింది. బాధితురాలకి అర్మాన్ అనే నిందితుడితో సంబంధం ఉన్నట్లు తేలింది. ఫిబ్రవరి 18న అతను బాధితురాలికి బలవంతంగా యాసిడ్ తాగించాడు.
Read Also: Amritpal Singh: వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ తల్లి అరెస్ట్.. కారణం ఇదే..
నిందితుడు కొంతకాలంగా బాధితురాలితో స్నేహంగా మెలిగారు. పెళ్లి చేసుకుంటాననే సాకుతో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే బాధితురాలు గర్భం దాల్చింది. అయితే, అర్మాన్ మాత్రం బాధితురాలి గర్భాన్ని తీయించేందుకు అబార్షన్ మాత్రలు వేసుకోవాలని బలవంతం చేశారు. అయితే, అందుకు ఆమె నిరాకారించింది. ఫిబ్రవరి 18న ఓ సీసాలో యాసిడ్ తీసుకువచ్చి, ఆమెకు బలవంతంగా తాగించాడు.
బాధితురాలు పోలీసులకు చెప్పిన వాంగ్మూలం ప్రకారం.. అర్మాన్ తనతో స్నేహంగా నటించి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు వెల్లడించింది. పెళ్లి చేసుకుంటాని మోసం చేశాడని చెప్పింది. అబార్షన్ మాత్రలు వేసుకోవడానికి నిరాకరించినందుకు యాసిడ్ తాగించాడని చెప్పింది. నెలన్నర కాలంగా ప్రాణాల కోసం పోరాడిన బాధితురాలు, చివరకు ఏప్రిల్ 7న మరణించింది. సెక్షన్ 376 కింద పోలీసులు కేసు నమోదు చేసి,దర్యాప్తు చేస్తున్నారు.