Uttar Pradesh: కొందరు మహిళలు చేస్తున్న నేరాలను చూస్తుంటే, ఆశ్చర్యం, అసహ్యం కలగకుండా ఉండదు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లో జరిగిన ఓ మహిళ పెళ్లి చేసుకున్న భర్తనే బ్లాక్‌మెయిల్ చేస్తుంది. తమకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు బయటపెడతానని, డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసింది. సదరు వ్యక్తి పోలీస్ అయినప్పటికీ.. ఆమె ఎక్కడా వెనక్కి తగ్గకుండా డబ్బులను డిమాండ్ చేసింది.
వివరాల్లోకి వెళ్తే సంగీతా దేవి అనే మహిళ ప్రభుత్వ అధికారులను పెళ్లి చేసుకుని, వారి నుంచి డబ్బులు వసూలు చేసేందుకు బ్లాక్‌మెయిల్ చేస్తోంది. పెళ్లి తర్వాత భర్తతో కలిసి ఉన్న బెడ్రూం వీడియోలను ఆన్లైన్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరిస్తోంది. డబ్బులు వసూలు చేసేందుకే ఈ విధంగా బరితెగించింది. చివరకు బాధిత పోలీస్ కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Read Also: Father Killed Son: ఢిల్లీలో దారుణం.. భార్యతో గొడవ.. ఇద్దరు కొడుకుల గొంతు కోసిన తండ్రి.. ఆపై
అప్పటికే సదరు మహిళకు ఇద్దరు ప్రభుత్వ అధికారులతో వివాహం జరిగిందనే సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అంతే కాకుండా వీరిని కూడా ఇలాగే బెదిరించి డబ్బులు వసూలు చేసిందని విచారణలో తేలింది. ఇలాగే తన మూడో భర్త అయిన కానిస్టేబుల్ శివమ్ నుంచి రూ. 30 లక్షలను డిమాండ్ చేసింది. తన డిమాండ్లను నెరవేర్చకుంటే ఇద్దరం సన్నిహితంగా ఉన్న వీడియోలను స్పైక్యామ్ ద్వారా చిత్రీకరించానని, వీటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించింది. అంతే కాకుండా తనపై అత్యాచారం చేస్తానని భర్తపై కేసు పెడతానని బెదిరించింది.
పెళ్లైన మొదట్లో భార్య తల్లిదండ్రులు, సోదరుడి నుంచి కూడా శివమ్ సమస్యలను ఎదుర్కొన్నారు. తమకు డబ్బులు, ఇళ్లు కావాలని ఒత్తిడి పెంచారు. దీనితో పాటు భార్య కూడా బెదిరింపులకు పాల్పడింది. సదరు మహిళ శివమ్‌కి ఫేస్‌బుక్ ద్వారా పరిచమైంది. ఈ ఏడాది జూన్ నెలలో పెళ్లి చేసుకున్నాడు. తాజాగా బెదిరింపుల నేపథ్యంలో ఆమెపై కేసుపెట్టాడు. దీంతో పాటు ఆమె సోదరుడు, తండ్రిని కూడా నిందితులుగా చేర్చారు. సంగీతకు ఇది మూడో వివాహమని, ప్రభుత్వ ఉద్యోగులను ట్రాప్ చేసి పెళ్లిళ్లు చేసుకుని ఇలా దోపిడికి తెరలేపుతోందని, గతంలో తన మాజీ భర్తలను కూడా ఇలాగే బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో తేలింది.