Crime: మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం.. అత్తగారింటికి వెళ్తుండగా అఘాయిత్యం..

  • ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం..
  • లేడీ హెడ్ కానిస్టేబుల్‌పై అత్యాచారం..
Crime

Crime

Crime: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. కర్వా చౌత్ జరుపుకునేందుకు కాన్పూర్‌లోని తన అత్తమామల ఇంటికి వెళ్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ అత్యాచారానికి గురైందని పోలీసులు తెలిపారు. నిందితుడు కల్లు అలియాస్ ధర్మేంద్ర పాశ్వాన్(34) కాన్పూర్ నగరంలోని సేన్ వెస్ట్ పారాలో బాధితురాలు 29 ఏళ్ల మహిళ ఉంటున్న పరిసర ప్రాంతంలోనే నివసిస్తున్నాడు.

Read Also: Sangareddy: ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్తో దూసుకెళ్తున్న ఉన్నతాధికారుల వాహనాలు..

కానిస్టేబుల్ తన షిఫ్ట్ ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో, ఆమెకు లిఫ్ట్ ఇచ్చిన నిందితుడు, ఆమె ఒంటరిగా ఉండటం గమనించి పక్కనే పొలాల్లోకి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేసిన మహిళ, నిందితుడి వేలిని కొరికింది. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైంది.