AP Crime: ప్రేమిస్తున్నాడంటూ మైనర్ బాలిక వెంట పట్టాడు.. ప్రేమ పేరుతో నమ్మించాడు.. కొన్ని రోజుల తర్వాత తన నైజాన్ని బయటపెట్టాడు.. బాలికను ఇంటికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. అంతే కాదు.. మరో యువకుడిని రప్పించి.. ఆ బాలికపై అఘాయిత్యం చేయించాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గోకవరానికి చెందిన బాలిక ఒక షాపులో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది.. అయితే, ఆ బాలికకు స్థానిక యువకుడితో పరిచయం ఏర్పడింది.. అది కాస్తా ప్రేమగా మారింది. ఇదే అదునుగా భావించిన యువకుడు.. తన ఇంట్లో పరిచయం చేస్తానని నమ్మించిన యువకుడు.. ఇంటికి తీసుకెళ్లాడు.. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మరో యువకుడిని ఇంట్లోకి పంపించి.. మరోసారి అఘాయిత్యం చేశారు.. దీనిపై బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పవన్ కుమార్ వెల్లడించారు..
Read Also: Hyderabad: హైదరాబాద్ రవాణా శాఖకు కాసుల వర్షం.. ఫాన్సీ నెంబర్ల వేలంలో లక్షల్లో ఆదాయం!
ఇక, విషయం తెలిసిన వెంటనే బాధితురాలు కుటుంబం దగ్గరకు వెళ్లి పరామర్శించారు మాజీ మంత్రి, జగ్గంపేట వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ తోట నరసింహం.. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన నరసింహం.. ఇది అత్యంత దారుణమైన చర్య అన్నారు.. నిందితులను తక్షణమే అరెస్టు చేసి, పోక్సో (POCSO) చట్టం కింద కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.. బాధిత కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు తోట నరసింహం..
