NTV Telugu Site icon

Two Constables Arrest: బస్సు డ్రైవర్ నుంచి రూ. 14 లక్షలు లూటీ.. ఇద్దరు కానిస్టేబుల్స్ అరెస్ట్

Constable Arrest

Constable Arrest

ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్ నుంచి రూ. 14 లక్షలు కాజేసిన ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ అరెస్టు అయ్యారు. వారిపై చీటింగ్ కేసు కింది కేసు నమోదైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. కానిస్టేబుల్స్ కాచేసిన డబ్బు ఓ వ్యాపారికి చెందిన హవాల డబ్బుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇండోర్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివరాలు.. డిసెంబర్ 23న స్థానికి వ్యాపారి అంకిత్ జైన్ అహ్మదాబాద్‌కు చెందిన కన్హయ్య లాల్‌కు రూ. 14 లక్షలు ఒక పెట్టలో పెట్టి ప్రైవేటు బస్సు డ్రైవర్ ద్వారా తరలించాడు. ఈ క్రమంలో చందన్ నగర్ పోలీసుల స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ యోగేష్ చౌహాన్, దీపక్ యాదవ్‌లకు ఈ విషయం తెలిసింది.

Also Read: Viral Video: ప్రధానిపై ఇంత ద్వేషమా..! మోడీ పోస్టర్‌పైకి రాయి విసిరిన వ్యక్తి

దీంతో దర్యాప్తు పేరుతో బస్సు తనిఖీ చేసిన సదరు కానిస్టేబుల్స్ క్యాష్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ డబ్బు‌ను సీజ్ చేసినట్టు పోలీసు స్టేషన్‌‌కు సమాచారం ఇవ్వకుండా వారిద్దరే ఆ నగదును తీసుకున్నారు. దీంతో ఆ డబ్బు అందలేదని వ్యాపారి కన్హయ్య లాల్‌.. అంకిత్ జైన్‌కి తెలిపాడు. దీంతో అంకిత్ జైన్ బస్సు డ్రైవర్ నరేంద్ర తివారీపై చందన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆ డబ్బును యోగేష్ చౌహాన్, దీపక్ యాదవ్‌ స్వాధీనం చేసుకున్నట్టు డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. దీంతో వారిద్దరు ఆ డబ్బు కాజేసినట్టు తేలింది.

Also Read: Plane Lands on Frozen River: రన్‌వే అనుకుని నదిపై విమానం ల్యాండింగ్‌.. ప్రయాణికులు సురక్షితం

దీంతో పోలీసు ఉన్నతాధికారులు వారిపై చర్యలకు ఆదేశించారు. ఇద్దరు కానిస్టేబుల్స్‌ను సస్పెండ్ చేసి వారిపై చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మరోవైపు, వ్యాపారవేత్త అంకిత్ జైన్‌, బస్సు డ్రైవర్‌తో పెద్ద మొత్తంలో డబ్బు తరలించడంపై కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హవాలా మార్గంలో డబ్బు తరలిస్తున్నట్లు అనుమానించిన పోలీసులు ఆ డబ్బును స్వాధీనం చేసుకుని ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తామని అదనపు డీసీపీ వెల్లడించారు.