NTV Telugu Site icon

Tirupati Crime: తిరుపతిలో దారుణం వెనుక అసలు నిజాలు.. ఏం జరిగిందంటే..?

Tpt

Tpt

Tirupati Crime: లక్ష్మణుడుగా ఉండాల్సిన తమ్ముడు రావణాసురుడుగా మారాడు… తమ్ముడు సంతోషం కోసం.. తమ్ముడి కళ్లల్లో ఆనందం చూడాలని ఇంటికి పెద్దగా ఆలోచించి తమ్ముడికి పెళ్లి చేస్తే.. ఆ తమ్ముడు మాత్రం తనకు ఇష్టం లేని పెళ్లి అన్నయ్య చేశాడని… తన భార్య వెళ్ళిపోవడానకే అన్నే కారణం అని పగ పెంచుకున్నాడు.. సంతోషంగా ఉన్న అన్న కుటుంబాన్ని చూసి జీర్ణించుకొకపోయాడు.. దీంతో అదను చూసి వదిన, ఆమె ఇద్దరు కుమార్తెలను దారుణంగా హత్య చేశాడు. ఆపై తను కూడా ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. టెంపుల్ సిటీలో చోటుచేసుకుంది ఈ దారుణం..

Read Also: Rave Party Hyderabad: మాదాపూర్‭లో రేవ్ పార్టీ కలకలం..

తిరుపతిలో జరిగిన దారుణానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అన్న మీద కోపంతో ఓ తమ్ము డు కిరాతకంగా ప్రవర్తించాడు. వదిన సునీతను హత్య చేసిన మరిది మోహన్‍.. ఆపై 8, 6వ తరగతి చదువుతున్న ఆమె ఇద్దరు పిల్లలు దేవీశ్రీ, నీరజలను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆపై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం తిరుపతిలో సంచలనంగా మారింది. నెల్లూరుకు చెందిన గుడిమెట్ల తిరిపి దాస్ పదేళ్ల క్రితం కుటుంబంతో వచ్చి తిరుపతి పద్మావతి నగర్ లో నివాసం ఉంటున్నాడు. దాస్‌ స్థానికంగా ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తిరిపి దాస్ తమ్ముడు గుడిమెట్ల మోహన్ చెన్నైలో పనిచేస్తున్నాడు. సాఫ్ట్‌‌వేర్‌ ఇంజనీర్ ఉద్యోగంలో ఉన్న మోహన్‌కు అన్నావదినలు 2019లో పెళ్లి చేశారు. అయితే, పెళ్లై ఓ కుమార్తె పుట్టిన తర్వాత మోహన్‌కు అతని భార్యకు మధ్య గొడవలు జరగడంతో 2021లో అతని భార్య పుట్టింటికి వెళ్లి పోయింది.

Read Also: Nara Bhuvaneswari: నేను సీఎం భార్యగా రాలేదు.. మీలో ఒక మహిళగా..

ఇక, ఆ తరువాత తిరిపి దాస్‌.. తమ్ముడు మోహన్‌ భార్య, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి ఇద్దరూ కలిసి కాపురం చేసుకునేలా రాజీకుదిర్చాడు. రాజీ చర్చల సమయంలో తనకు ఇష్టంలేని పెళ్లి చేసి మనశాంతి లేకుండా చేశావంటూ అన్నపై తమ్ముడు మోహన్ దాడి చేశాడు. ఆ తర్వాత రాజీ కుదరడంతో మోహన్‌ భార్య కాపురానికి వచ్చింది. పుట్టింటి నుంచి వచ్చిన కొంతకాలానికి భార్యతో మళ్లీ గొడవలు ప్రారంభం కావటంతో ఆమె తిరిగి వెళ్లిపోయింది. ఈ క్రమంలో చెన్నైలో ఉద్యోగం చేస్తున్న మోహన్ అప్పుడప్పుడు తిరుపతిలోని అన్న ఇంటికి వచ్చి ఉండేవాడు. అలా నిన్న సాయంత్రం ఇంటికి వచ్చి అన్నతో కలిసి మోహన్ మద్యం తాగాడు. అనంతరం దాసు బయటికి వెళ్ళాడు. ఇది అదనుగా భావించిన మోహన్ అప్పుడే ట్యూషన్‌ నుంచి వచ్చిన అన్న కుమార్తెలు దేవశ్రీ , నీరజ , భార్య సునీతలను కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. వారంతా రక్తం మడుగులో ఉండగా, వారి మృతదేహాలను బయటికి తరలించేందుకు యత్నించాడు. అయితే, చుట్టుపక్కల ప్రజలు బయటే తిరుగుతుండటంతో భయంతో ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకొని తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. మోహన్ అన్న దాసు ఇంటికి వచ్చేసరికి లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో, తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లి చూడగా భార్యాపిల్లలు హాలులో రక్తం మడుగులో పడి ఉన్నారు. లోపలి గదిలో మోహన్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు.

Read Also: Rave Party Hyderabad: మాదాపూర్‭లో రేవ్ పార్టీ కలకలం..

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పెళ్లై ఓ బిడ్డ పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలతో విడిపోవడం, ఇదే సమయంలో అన్న కుటుంబం సంతోషంగా ఉండటంతో సొంత ఇల్లు, కారు కొనడం లాంటివి తట్టుకోలేక పోయాడు.. వారిపై కక్ష పెంచుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇష్టం లేని పెళ్లి చేయడం వల్ల తాను విడిపోవావాల్సి వచ్చిందని నిందితుడు తరచూ అన్నతో గొడవపడే వాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. రక్తపు మడుగులో పడిఉన్న భార్యా పిల్లల్ని చూసి తిరిపిదాస్‌ గుండెలు బాదుకున్నాడు. ఈ ఘటనపై తిరుపతి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు దారి తీసిన పరిణామాలు తెలియని నేపథ్యంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అప్పటి వరకు అన్నతో మద్యం తాగిన తమ్ముడు, ఆయన బయటకు వెళ్లిన కొద్దిసేపటికే ఈ దారుణానికి పాల్పడటంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.