NTV Telugu Site icon

Travels bus Accident: హైవేపై బోల్తాపడ్డ ట్రావెల్స్ బస్

రోడ్లపై ప్రమాదాలు సర్వసాధారణం అయిపోయాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరు కండ్రిక వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై అదుపుతప్పి పిఎస్సార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

బళ్లారి నుండి నెల్లూరు కు వెళుతుండగా జరిగిన ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన పోలీసులు గాయపడినవారిని ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు.

మరో ఘటనలో కృష్ణా జిల్లాలో కంటైనర్ వాహనానికి ప్రమాదం జరిగింది. గన్నవరం దగ్గర 16వ జాతీయ రహదారిపై బాపులపాడు మండలం బొమ్ములూరు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. హైద్రాబాద్ నుంచి రాజమండ్రి వెళుతున్న అమెజాన్ కంపెనీకు చెందిన కంటైనర్ వాహనం డివైడర్ ని ఢీకొంది. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా వాహనంలో మంటలు చెలరేగాయి. దీంతో కంటైనర్ లో ఉన్న సామాగ్రి మొత్తం దగ్ధం అయిందని పోలీసులు తెలిపారు.

Read Also: Ap Highcourt: సంక్షేమ వసతి గృహాల దుస్థితిపై హైకోర్ట్ ఆగ్రహం