NTV Telugu Site icon

Suicide: ఢిల్లీ డీర్ పార్క్‌లో చెట్టుకు ఉరివేసుకుని టీనేజర్లు ఆత్మహత్య..

Suicide

Suicide

ఢిల్లీలోని డీర్ పార్క్‌లో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. పార్కులో ఒక చెట్టుకు ఉరివేసుకుని యువతీ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ మృతదేహాలను చూసిన పార్క్ సెక్యూరిటీ గార్డ్.. పోలీసులకు సమాచారం అందించారు. ప్రాథమిక దర్యాప్తులో ఇది ఆత్మహత్య కేసుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించి డీర్ పార్క్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న బల్జీత్ సింగ్.. ఈరోజు ఉదయం 6:31 గంటలకు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో.. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Read Also: Supreme Court : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై మరో కీలక పరిణామం

ఆత్మహత్యకు పాల్పడింది 17 ఏళ్ల బాలుడు నల్లటి టీ-షర్టు, నీలిరంగు జీన్స్ ధరించి ఉన్నాడు. 17 సంవత్సరాల వయస్సు బాలిక ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి చెట్టుకు వేలాడుతూ కనిపించారు. ఇద్దరూ ఒకే నైలాన్ తాడుతో చెట్టుకు ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు వెంటనే క్రైమ్ టీమ్‌ను పిలిపించి, సంఘటన స్థలంలో మరింత విచారణ చేపట్టారు. అనంతరం.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉందని.. దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Read Also: David Warner: ఎయిరిండియాపై డేవిడ్ వార్నర్ ఫైర్.. కారణమిదే..?