Suicide Attempt: అప్పు ఇవ్వడం వరకే.. అప్పు ఇచ్చిన వారి చేతుల్లో ఉంటుంది. తిరిగి రాబట్టుకోవడం అంటే ఓ పెద్ద సవాల్‌గానే మారుతోంది. అప్పు ఇచ్చిన వారు.. తీసుకున్న వారికే భయపడే రోజులు కనిపిస్తున్నాయి. తాజాగా పల్నాడు జిల్లాలో అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంట్లో.. అప్పు తీసుకున్న వాడి కారణంగా ఇద్దరు బలయ్యారు. అసలు ఆ అప్పు కథేంటి? అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంట్లో విషాదం ఎలా జరిగింది? చూద్దాం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇతని పేరు రామనాథం శీను. ఊరు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ఫణిదం. శీను గ్రామంలో కిరాణాషాపు నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గ్రామంలో రెండున్నర ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం కూడా చేస్తున్నాడు.
అయితే రామనాథం శీను.. ఆస్పత్రిలో ఉండడానికి కారణం.. అతను ఇచ్చిన అప్పు అంటే నమ్మగలరా? కానీ అదే నిజం. అదే గ్రామానికి చెందిన దాసరి వెంకటేశ్వర్లుకు శీను 90 వేల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. గడువు తీరినా ఇవ్వకపోవడంతో పెద్దమనుషుల వద్ద పంచాయితీ కూడా జరిగింది. దీంతో వెంకటేశ్వర్లు 25 వేల రూపాయలు తిరిగి ఇచ్చాడు. మిగతా బాకీ నెమ్మదిగా తీరుస్తానని చెప్పాడు. మళ్లీ బాకీ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడంతో వెంకటేశ్వర్లు ఇంటికి శీను కుటుంబ సభ్యులు వెళ్లారు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. డబ్బులు ఇవ్వాల్సిందేనని వెంకటేశ్వర్లును గట్టిగా అడిగి వెళ్లిపోయారు.
Domestic Violence: మనిషివా..? మృగానివా..? నిన్ను ఏం చేసినా తప్పుకాదేమో!
అయితే బాకీ ఇవ్వాలని ఇంటికొచ్చి అడగడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు వెంకటేశ్వర్లు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. బాకీ డబ్బులు ఇవ్వాలని అడగడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని చెబుతున్నాడు.
బాకీ డబ్బులు ఇవ్వాలని అడిగిన తర్వాత వెంకటేశ్వర్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో శీను కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఇదే విషయంపై కుటుంబ సభ్యుల మధ్య చర్చ జరిగింది. వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తారని భావించి ఆందోళనకు గురయ్యారు. భార్య పూర్ణ కుమారి, కొడుకు వెంకటేష్ పొలానికి వెళ్లిన తర్వాత ఇంట్లో గడ్డిమందు తాగాడు శీను.
తర్వాత పొలానికి వెళ్లి ఇదే విషయాన్ని భార్యకు చెప్పాడు. మీరు లేకుండా మేము మాత్రం బతకడం ఎందుకంటూ కొడుకు వెంకటేష్‌తో కలిసి పొలంలోని బావిలో దూకింది భార్య పూర్ణ కుమారి. వెంటనే శీను ఈ విషయాన్ని పాలడుగులో ఉంటున్న అల్లుడు చంద్రశేఖర్‌కు ఫోన్‌లో చెప్పాడు. వెంటనే అల్లుడు హుటాహుటిన పొలం వద్దకు చేరుకున్నాడు. అప్పటికే శీను పొలంలో పడి ఉన్నాడు. వెంటనే మామను సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నాకు ఇవ్వాల్సిన డబ్బులు అడిగితే వెంకటేశ్వర్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో భయాందోళనలకు గురయ్యానంటున్నాడు శీను. తన కళ్లముందే భార్య, కొడుకు బావిలో దూకారని ఆవేదన వ్యక్తం చేశాడు.
Pakistan: ఛీ.. ఛీ.. ఆటే కాదు.. నిరసన చేయడం కూడా చేతకాదా? ఆసియా కప్ 2025లో హైడ్రామా!
కేసు భయంతో బావిలో దూకిన తల్లీకొడుకుల మృతదేహాలకోసం గజ ఈతగాళ్లు గాలించారు. తల్లి పూర్ణకుమారి మృతదేహం లభ్యమైనా కొడుకు వెంకటేష్ మృతదేహం లభించలేదు. దీంతో వెంకటేష్ మృతదేహాన్ని బయటకు తీసేందుకు మోటార్ల సాయంతో బావిలోని నీటిని బయటకు తోడే ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో గజ ఈతగాళ్లు కూడా 6 గంటలపాటు గాలింపు చేసి వెంకటేష్ మృతదేహాన్ని గుర్తించి బావిలోనుంచి బయటకు తీశారు. వెంకటేష్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. అప్పు ఇచ్చి కుటుంబంలో ఇద్దరు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
