Mumbai: బాలికపై ముగ్గురు ఉపాధ్యాయుల లైంగిక వేధింపులు..
- ఉపాధ్యాయ వృత్తికే చెడ్డ పేరు తెచ్చారు..
- మైనర్ బాలికపై ముగ్గురు ట్యూషన్ టీచర్ల అఘాయిత్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai: ముంబైలో దారుణం జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఉపాధ్యాయ వృత్తికే చెడ్డ పేరు తెచ్చారు. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు ట్యూషన్ టీచర్లు పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌతమ్, తరుణ్ రాజ్ పురోహిత్, సత్యరాజ్ అనే ముగ్గురు ఉపాధ్యాయులు బాలికను లైంగికంగా వేధించడమే కాకుండా, ఆమె అసభ్యకరమైన చిత్రాలను, వీడియోలను కూడా చూపించారు.
Read Also: Hassan Nasrallah: హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా చనిపోయే ముందు, చివరి ప్రసంగంలో ఏం చెప్పాడు..?
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ఈ కేసులో గౌతమ్, తరుణ్ రాజ్‌పురోహిత్‌లను సెప్టెంబర్ 28న అరెస్టు చేశారు. సోమవారం వరకు కస్టడీలో ఉంటారు. సత్యారాజ్‌ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ముగ్గురు కూడా బాలికపై పదే పదే వేధింపులకు పాల్పడ్డారు. ఆమె తల్లి మొదట్లో ఫిర్యాదు చేసేందుకు ఇష్టపడలేదని, కౌన్సిలర్ ఆమెను ఒప్పించడంతో తాము అమ్మాయి స్టేట్‌మెంట్ రికార్డు చేశామని, నిందితులు ఆమెను బెడ్‌రూంలోకి తీసుకెళ్లి అనుచితమైన, అసభ్యకరమైన చిత్రాలను, వీడియోలను చూపారని పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం, ఇంట్లో మగవారు లేకపోవడం వంటి కారణాలతో బాలిక పరిస్థితిని ఆసరాగా తీసుకున్న నిందితులు పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితులపై పోక్సో చట్టంలోని సెక్షన్ 354 (దౌర్జన్యం / నేరపూరిత శక్తి), 376 (2) (అత్యాచారం), 377 (అసహజ సెక్స్) మరియు 12, 4, 8 కింద అభియోగాలు మోపారు.
తాజావార్తలు
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
-
Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
-
Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!