NTV Telugu Site icon

Mumbai: బాలికపై ముగ్గురు ఉపాధ్యాయుల లైంగిక వేధింపులు..

Mumbai

Mumbai

Mumbai: ముంబైలో దారుణం జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఉపాధ్యాయ వృత్తికే చెడ్డ పేరు తెచ్చారు. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు ట్యూషన్ టీచర్లు పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌతమ్, తరుణ్ రాజ్ పురోహిత్, సత్యరాజ్ అనే ముగ్గురు ఉపాధ్యాయులు బాలికను లైంగికంగా వేధించడమే కాకుండా, ఆమె అసభ్యకరమైన చిత్రాలను, వీడియోలను కూడా చూపించారు.

Read Also: Hassan Nasrallah: హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా చనిపోయే ముందు, చివరి ప్రసంగంలో ఏం చెప్పాడు..?

ఈ కేసులో గౌతమ్, తరుణ్ రాజ్‌పురోహిత్‌లను సెప్టెంబర్ 28న అరెస్టు చేశారు. సోమవారం వరకు కస్టడీలో ఉంటారు. సత్యారాజ్‌ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ముగ్గురు కూడా బాలికపై పదే పదే వేధింపులకు పాల్పడ్డారు. ఆమె తల్లి మొదట్లో ఫిర్యాదు చేసేందుకు ఇష్టపడలేదని, కౌన్సిలర్ ఆమెను ఒప్పించడంతో తాము అమ్మాయి స్టేట్‌మెంట్ రికార్డు చేశామని, నిందితులు ఆమెను బెడ్‌రూంలోకి తీసుకెళ్లి అనుచితమైన, అసభ్యకరమైన చిత్రాలను, వీడియోలను చూపారని పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం, ఇంట్లో మగవారు లేకపోవడం వంటి కారణాలతో బాలిక పరిస్థితిని ఆసరాగా తీసుకున్న నిందితులు పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితులపై పోక్సో చట్టంలోని సెక్షన్ 354 (దౌర్జన్యం / నేరపూరిత శక్తి), 376 (2) (అత్యాచారం), 377 (అసహజ సెక్స్) మరియు 12, 4, 8 కింద అభియోగాలు మోపారు.

Show comments