NTV Telugu Site icon

Honey Trap Case: అందమే పెట్టుబడి.. ఉచ్చులో చిక్కితే విలవిలే..! హనీ ట్రాప్ కేసులో విస్తుపోయే విషయాలు

Vizag

Vizag

Honey Trap Case: రోజుకో రకమైన మోసాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. అందంతో ఎరవేసి.. వంచించేవాళ్లు కొందరు అయితే.. నమ్మించి గొంతుకోసే రకాలు ఎన్నో ఉన్నాయి.. ఎని బ్లాక్‌ మెయిల్‌.. సైబర్ కేటాగుళ్లు ఇలా కొదవేలేదు.. ఎవ్వడిని నమ్మోలో కూడా తెలియని పరిస్థితి.. తాజాగా విశాఖలో ఓ కిలాడీ లేడీ వ్యవహారం వెలుగుచూసింది.. విదేశాల్లో స్థిరపడ్డ, బాగా సంపాదించిన మగవాళ్లే ఆమె టార్గెట్‌ కాగా.. సోషల్ మీడియా ద్వారా ఎన్నారైలకు వల విసరడం, అందమైన ఫోటోలు షేర్ చేసి ఆకర్షించడం, ప్రేమ పెళ్లి పేరుతో లైన్‌లో పెట్టడం.. అవసరం అయితే.. వీడియో కాల్స్‌ కూడా చేయడం.. ఆమె దినచర్య. అయితే, ఆమె మొహంలో పడితే అంతే.. వాళ్ల దగ్గర నుంచి దొరికినంత దోచుకుని.. నిండా ముంచేయడంలో ఆమె దిట్ట..

Read Also: Medical Emergency: ఢిల్లీ-లండన్ విమానం డెన్మార్క్‌లో అత్యవసర ల్యాండింగ్

విశాఖపట్నంలో వెలుగుచూసన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. మురళీనగర్ ఎన్జీవోస్ కాలనీకి చెందిన ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఎన్ఆర్ఐ యువకుడితో పరిచయం పెంచుకుంది. ప్రేమిస్తున్నట్టు మాయమాటలు చెప్పి నిలువునా ముంచేసింది. ఆమె నుంచి తప్పించుకున్న యువకుడు భీమిలి పోలీసులను ఆశ్రయించాడు.. తీగలు లాగితే అసలు డొంకలు కదిలాయి.. షీలానగర్ కు చెందిన ఓ కుటుంబం కొంతకాలంగా అమెరికాలో ఉంటోంది. ఇన్‌స్టా ద్వారా వారి కుమారుడితో మురళీనగర్ ఎన్జీవోస్ కాలనీకి చెందిన కొరుప్రోలు జాయ్ జెమీమా పరిచయం పెంచుకుంది. బాధిత యువకుడి ద్వారా షీలానగర్ లోని వారి చిరునామా తెలుసుకుంది. అతని తల్లిదండ్రులు షీలానగర్‌లో ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్లి కొన్ని రోజుల పాటు మంచి అమ్మాయిగా నటించింది. మీ అబ్బాయి స్నేహితురాలినని.. పెళ్లి చేసుకుంటానని అడగ్గా.. అతని తల్లిదండ్రులు నిరాకరించారు.

Read Also: Hardik Pandya Shot: ఏంటి హార్దిక్‌.. ఇలా కూడా షాట్ ఆడొచ్చా! వీడియో చూస్తే బిత్తరపోవాల్సిందే

అయితే, ఆ తర్వాత కాలంలో అమెరికాలో తల్లిదండ్రుల వద్ద ఉంటున్న బాధిత యువకుడిని మాయ మాటలు చెప్పి విశాఖకు రప్పించింది. ఎయిర్‌పోర్ట్‌ నుంచే యువకుడిని మురళీనగర్ లోని తన ఇంటికి తీసుకువెళ్లి బంధించింది. మత్తు పదార్థాలు కలిపిన జ్యూస్‌లు.. ఇతర డ్రింక్స్‌ ఇచ్చి పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తూ మైకంలో ఉన్నప్పుడు దగ్గరగా ఉన్నట్లు ఫొటోలను తీయించింది. వాటితో ఆ యవకుడిని బ్లాక్‌మెయిల్‌ చేసింది. యువకుడు తన తల్లిదండ్రులకు చెప్పిపెళ్లికి ఒప్పిస్తానన్నా వినిపించుకోకుండా జెమీమా.. తన సహచరులతో కలిసి తరచూ బెదిరించేది. ఈ క్రమంలో ఇటీవల భీమిలిలోని ఒక హోటల్లో బల వంతంగా నిశ్చితార్థం చేసుకుని.. యువకుడితో రూ.5 లక్షల వరకు ఖర్చు చేయించింది. యువకుడి ఫోన్ బ్లాక్ చేసి, నిశ్చితార్థం, వారు దగ్గరగా ఉన్న ఉన్న ఫొటోలు చూపించి.. మురళీనగర్ లోని తన ఇంట్లో మళ్లీ నిర్బంధించింది. తనను పెళ్లి చేసుకోక పోతే ఈ ఫొటోలతో పోలీస్ కేసులు పెట్టించి.. అమెరికా వెళ్లకుండా చేస్తానని అతని వద్ద డబ్బులు కాజేసింది. ఆమె ఇంటి నుంచి అతను ఒకసారి పారిపో యేందుకు ప్రయత్నించగా సహచరులతో కలిసి కత్తితో చంపడానికి ప్రయత్నించింది.

Read Also: Israeli PM: తర్వలోనే ఇరాన్‌పై దాడి చేస్తాం.. మేమే గెలుస్తాం: నెతన్యాహు

ఆమె సహచరులు కూడా జెమీమాను పెళ్లి చేసుకోకపోతే చంపే స్తామని బెదిరింపులకు దిగేవారు. ఎట్టకేలకు ఈ నెల 4వ తేదీన బాధిత యువకుడు ఆమె నుంచి తప్పించుకుని భీమిలి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు మురళీనగర్ లో జెమీమాను అదు పులోకి తీసుకుని.. ఆమె నుంచి ల్యాప్‌టాప్‌, ట్యాబ్, మూడు ఫోన్లు, కారు సీజ్ చేశారు. శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో కూడా జెమీమా, ఆమె స్నేహితులు ధనవంతుల అబ్బాయిలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు బాధిత యువకుడు పోలీసులకు తెలిపాడు. జెమీమా స్నేహితులపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. హానీ ట్రాప్‌ కేసులో కీలక విషయాలు విశాఖ పోలీసు కమీషనర్ తెలిపారు.. తెలుగు రాష్ట్రాల్లో బాధితులు ఉన్నారని అంతా పథకం ప్రకారం ముఠా ప్లాన్‌ చేస్తోందనినిందితురాలు జమీమాకు ఓ ముఠా శిక్షణ ఇచ్చిందని ఎలా ట్రాప్‌ చేయాలి ఎవర్ని ట్రాప్ చేయ్యాలి.. మత్తు ఎలా ప్రయోగించాలి.. వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ ఎలా చేయాలని నేర్పించారు.. అన్ని ఆధారాలను సేకరిస్తున్నాం.. అందరినీ అరెస్ట్‌ చేస్తామని.. విశాఖ సీపీ బాగ్చి తెలిపారు.

Show comments