సరదాగా ఆట పాటించడంలో అనుకొని ప్రమాదాలు జరుగుతాయి. ఆ సరదా లో ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. ఇలాంటి వార్తలు మనం చాలా చూశాం. తాజాగా కాచిగూడ లో ఇలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. కాబోయే భార్య ను భయపెడదామని గొంతుకు వైరు బిగించుకున్ని వీడియో కాల్ చేసిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెలితే.. కాచిగూగ తిలక్‌నగర్ లో ఆదర్శ అనే యువకుడు ఫ్యామిలతో నివాసం ఉంటున్నాడు. క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్న ఆదర్శకు రీసెంట్ గానే పెళ్లి కుదిరింది. ఈ క్రమంలో సరదాగా ఫోన్ మాట్లాడుతూ.
ఫ్యాన్ కి ఐరన్ బాక్స్ వైర్ తో తన గొంతుకు బిగించుకుని, ఈ దృశ్యాన్ని తన కాబోయే భార్యకు వీడియో ద్వారా చూపించాడు ఆదర్శ్. అంతలోనే సరదాగా నేను ఆటపటించడాని ఇలా చేశాను అంటూ స్టూల్ మీద నుండి కిందకి దిగుతున్న క్రమంలో ఒక్కసారిగా గొంతుకు వైర్ బిగుసుకుపోయి గిలగిల కొట్టుకున్నాడు, ఆ సమయంలో కాపాడానికి కూడా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు ఆదర్శ్. వచ్చేనెల పెళ్ళి, అని ఏర్పట్లు పూర్తిచేసుకున్న క్రమంలో ఇలాంటి దారుణం జరగడంతో.. రెండు కుటుంబల్లో విషాద ఛాయాలు అలుముకున్నాయి. ఇక ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.