నిధుల మళ్లింపు వ్యవహారంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకు (టీఆర్‌ఎస్) చెందిన మధుకాన్ సంస్థల కార్యాలయాలు, ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి సంబంధించి బ్యాంకులను రూ.1064 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై ఇదివరకే సీబీఐ కేసు నమోదు చేయగా ఇప్పుడు ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. నామా నాగేశ్వరరావు నేతృత్వంలోని మధుకాన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ రాంచీ-జంషెడ్‌పూర్‌ల మధ్య 163 కిలోమీటర్ల పొడవైన నాలుగు…