Site icon NTV Telugu

లాడ్జిలో నగ్నంగా అతడు, ఆమె.. ఏ పరిస్థితిలో కనిపించారంటే..?

madyapradesh

madyapradesh

మహారాష్ట్రలోని పింప్రి చించివాడలో దారుణం చోటుచేసుకొంది. అధర్వ లాడ్జిలో ఒక జంట ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. బుధవారం మధ్యాహ్నం ప్రకాష్ తోమార్‌(30), మరో మహిళ(28) అధర్వ లాడ్జిలో ఒక రూమ్ ని అద్దెకు తీసుకున్నారు. గురువారం వెళ్లిపోతామని, ఉదయం తమను లేపాల్సిందిగా కోరారు.

సరే అని గురువారం హోటల్ సిబ్బంది ప్రకాష్ ఉన్న రూమ్ కి వెళ్లి తలుపులు కొట్టగా సమాధానం రాలేదు. దీంతో వారి దగ్గర ఉన్న మరొక తాళంతో డోర్ ఓపెన్ చేసి షాకయ్యారు. గదిలో ఇద్దరు నగ్నంగా విగతజీవులై కనిపించారు. వెంటనే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. మహిళ గొంతును నొక్కి హత్యచేసి, అనంతరం అతను ఆమె చీరతో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నాయి. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు విచారణ చేపట్టారు

Exit mobile version