Site icon NTV Telugu

Washington : అక్కడ తినడమే అతను చేసిన నేరం.. అందుకే ఫైరింగ్

Texas Cop Fired After Shooting Burger Eating Teen

Texas Cop Fired After Shooting Burger Eating Teen

Washington: కారులో కూర్చొని బర్గర్ తింటున్న వ్యక్తిపై పోలీస్ కాల్పులు జరిపాడు. అమెరికాలోని శాన్ డియాగోలో ఉన్న ఓ మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్. ఎరిక్ కంటూ అనే 17 ఏళ్ల యువకుడు అందులో బర్గర్లను కొనుగోలు చేశాడు. పార్కింగ్ లాట్ లో ఉన్న తన కారులో కూర్చుని తింటున్నాడు. ఇంతలో జేమ్స్ బ్రెనాండ్ అనే పోలీసు అధికారి వచ్చాడు. కారు డోర్ తీసి కిందికి యువకుడిని దిగాలన్నాడు. ఎందుకు అని అడిగితే రివాల్వర్ తీసి గురిపెట్టాడు. అది చూసి భయపడిన యువకుడు.. కారును పక్కకు తీయడానికి ప్రయత్నించాడు. అంతే సదరు పోలీసు రివాల్వర్ తో పలు రౌండ్లు కాల్పులు జరిపాడు. సాన్ ఆంటోనియా ప్రాంతంలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

కారులో కొంత దూరం పారిపోయిన యువకుడికి పలుచోట్ల బుల్లెట్ గాయాలు అయి ఆగిపోయాడు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. సదరు యువకుడు తనపై దాడికి ప్రయత్నించాడని జేమ్స్ బ్రెనాండ్ చెప్పడంతో.. యువకుడిపైనే కేసు పెట్టారు. తర్వాత సదరు పోలీసు డ్రెస్ కు అమర్చి ఉన్న బాడీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను ఉన్నతాధికారులు పరిశీలించగా వాస్తవాలు బయటపడ్డాయి. సదరు కారులో ఉన్న యువకుడు ఎలాంటి ప్రమాదకర ప్రయత్నాలు చేయలేదని గుర్తించి.. అతడిపై నమోదు చేసిన కేసులను ఎత్తివేశారు. పోలీసు కాల్పుల్లో గాయపడిన బాధితుడు ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ప్రాణ రక్షణ కోసమే తుపాకీ వాడాలనేది అక్కడ నిబంధన కాగా అలాంటి పరిస్థితి ఏమీ కనిపించలేదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

Read Also: Indian Origin Family Murder : పాత కక్షలతోనే భార‌త సంత‌తి కుటుంబం హ‌త్య

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ‘కెండాల్ బ్రౌన్’ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. సదరు పోలీసు తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ‘ఇది చాలా దారుణం’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘కొందరు పోలీసుల తీరు చూస్తుంటే.. ఎక్కడికి వెళ్లినా, ఏ సమయంలో అయినా రక్షణ లేనట్టే అనిపిస్తోంది’ అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Exit mobile version