Site icon NTV Telugu

Affair Murder: మొగిడి ప్రాణాలు తీస్తున్న మోజు.. దారుణంగా కొంత మంది భార్యల తీరు

Telangana Crime

Telangana Crime

Affair Murder: కొంత మంది భార్యలు.. రాను రాను దారుణంగా తయారవుతున్నారు. వివాహేతర బంధం మోజులో పడి.. కట్టుకున్న వాడిని కూడా కడతేర్చేందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఇవే ఘటనలు రిపీట్ అవుతున్నాయి. తాజాగా ఓ భార్య.. భర్తపై వేడి నూనె పోసింది. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. మరో ఘటనలో ప్రియుడి సాయంతో భర్త చెవులు కోసేసింది. చెవులు పోయినా ఆ భర్త ప్రాణాలు దక్కాయి. ఈ రెండు ఘటనలు తెలంగాణలో కలకలం సృష్టిస్తున్నాయి.

READ ALSO: Moolakona Mystery: ఆస్తి కోసమా.. పరువు కోసమా? మూలకోన అటవీ ప్రాంతంలో మిస్టరీ డెత్స్ కలకలం..

ఆయన పేరు వెంకటేష్. ఇతనికి 8 ఏళ్ల క్రితం పద్మతో వివాహమైంది. ముగ్గురు పిల్లలతో కలిసి జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం మల్లెందోడ్డిలో నివసిస్తున్నారు.. ప్రతి ఒక్కరి సంసారంలో చిన్న చిన్న గొడవలు ఉన్నట్లే.. వెంకటేష్, పద్మ దాంపత్య జీవితంలోనూ గొడవలు ఉన్నాయి. 4 ఏళ్ల నుంచి జరుగుతున్న గొడవలు ఈ మధ్య కాస్తా పెద్దవి అయ్యాయి. నిత్యం గొడవ పడుతూ పలుమార్లు పంచాయితీలు కూడా చేసుకున్నారు. రోజూ తనను కొడుతున్నాడని భార్య పద్మ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 11న దారుణానికి ఒడిగట్టింది. తెల్లవారుజామున భర్త నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా అతనిపై వేడి నూనె పోసింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బయటకు పరుగెత్తాడు. స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు… స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు భార్య పద్మను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేష్ మృతి చెందాడు. దీంతో పద్మను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. అలాగే భర్తపై వేడి నూనె పోసినట్లు పద్మ అంగీకరించిందని తెలిపారు..

మేడ ప్రసాద్‌కు రష్మితో ఆరేళ్ల క్రితం వివాహం
మరో ఘటనలో భార్య వేసిన మర్డర్ ప్లాన్ నుంచి భర్త తృటిలో తప్పించుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా గడ్డిగూడెంలో జరిగింది. గడ్డిగూడెంకు చెందిన మేడ ప్రసాద్‌కు కొత్తగూడ మండలం గోవిందాపురానికి చెందిన రష్మితో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.. సజావుగా సాగుతున్న ప్రసాద్, రష్మి కాపురంలో ఇన్‌స్టాగ్రామ్ చిచ్చు పెట్టింది. రష్మికి ఇన్‌స్టాగ్రామ్‌లో అనిల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర బంధానికి దారి తీసింది. ఈ విషయం భర్త ప్రసాద్‌కు తెలియడంతో గొడవలు షురూ అయ్యాయి. కుమారుడు పుట్టినప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి…

ప్రియుడిని వెంట పెట్టుకుని వచ్చిన రష్మి
మరోవైపు అనిల్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్న రష్మి.. తమ బంధానికి భర్త ప్రసాద్ అడ్డుగా ఉన్నాడని భావించింది. ఈ క్రమంలో అతన్ని చంపేయడానికి స్కెచ్చేసింది. అనుకున్నదే తడవుగా ప్లాన్ రెడీ చేసింది. తన అక్క డెలివరీ అయిందని.. పాకాల కొత్తగూడ వెళ్లాలని భర్తకు చెప్పి వెళ్లింది. తిరిగి వచ్చేటప్పుడు ప్రియుడిని కూడా వెంట పెట్టుకుని గడ్డిగూడెం చేరుకుంది. అర్థరాత్రి భర్త ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ప్రియునితో కలిసి కత్తితో దాడి చేసి చంపేయాలని ప్లాన్ చేసింది. కానీ వీళ్లు ఇద్దరూ చేస్తున్న అలికిడికి ప్రసాద్ నిద్ర లేచాడు. కానీ అనిల్ అతనిపై కత్తితో దాడి చేసి.. రెండు చెవులు నరికేశాడు. ఈక్రమంలోనే బయటకు పరుగెత్తిన ప్రసాద్.. ఇరుగు పొరుగు వారి సాయంతో ప్రాణాలు కాపాడుకున్నాడు… మరోవైపు ప్రసాద్‌పై హత్యాయత్నం చేసిన అనిల్‌కు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. భర్త ప్రసాద్ ఫిర్యాదు మేరకు రష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ప్రసాద్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు…

READ ALSO: Hamas Leadership: అజ్ఞాతంలోకి హమాస్ అగ్రనాయకత్వం.. ఆ ముగ్గురు ఎక్కడ?..

Exit mobile version