NTV Telugu Site icon

Telangana : గుడ్ బ్యాంక్ అని దొంగ లేఖ .. నన్ను పట్టుకోవడం కష్టమే అంటూ..

Telangana

Telangana

తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో బ్యాంకు శాఖ లాకర్లను తెరవడం లో విఫలమైన దొంగ భద్రతా చర్యలను అభినందిస్తూ ఒక సందేశాన్ని పంపాడని అతని కోసం వెతకవద్దని విజ్ఞప్తి చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.. నెన్నెల మండల కేంద్రంలో ని ప్రభుత్వ గ్రామీణ బ్యాంకు శాఖలో గురువారం ప్రధాన తలుపు తాళం పగులగొట్టి ముసుగు ధరించిన దొంగ లోపలికి ప్రవేశించినట్లు వారు తెలిపారు..

అతను క్యాషియర్ మరియు క్లర్క్‌ల క్యాబిన్‌ల లో వెతికినా కరెన్సీ లేదా విలువైన వస్తువులు దొరకలేదు. లాకర్లను తెరవడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత వార్తాపత్రికను తీసుకుని దానిపై మార్కర్ పెన్‌ తో తెలుగు లో ఇలా రాశాడు, “నాకు ఒక్క రూపాయి రాలేదు. నన్ను పట్టుకోవద్దు. నా వేలి ముద్రలు ఉండవు. మంచి బ్యాంకు” అని పోలీసులు తెలిపారు. బ్యాంకు నివాస గృహం నుండి పనిచేస్తుందని, సెక్యూరిటీ గార్డులు లేరని వారు తెలిపారు..

శుక్రవారం దోపిడీ యత్నాన్ని గమనించిన బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయడంతో సంబంధిత ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దొంగను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామ ని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.. ఏది ఏమైనా దొంగ ఇక లెటర్ రాసి వెళ్లడం కలకలం రేపింది.. ఒకవైపు భయపడుతున్నా మరోవైపు దొంగ తెలివికి ప్రశంసలు కురిపిస్తున్నారు..