NTV Telugu Site icon

Telangana: వరంగల్‌లో వీరంగం సృష్టించిన సైకో..ఇంట్లో చొరబడి రాళ్లతో దాడి..

Warangal

Warangal

తెలంగాణలో ఈ మధ్య సైకోలు ఎక్కువ అవుతున్నారు.. అసలు ఎక్కడినించి వస్తున్నారో కూడా తెలియకుండా కనిపించిన వారిపై దాడికి తెగబడుతున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా తెలంగాణలో మరో సైకో వీరంగం సృష్టించాడు.. కనిపించిన వారిని ఇష్టానూసారంగ కొట్టి గాయపరిచాడు.. ఈ ఘటన వరంగల్ లో వెలుగుచూసింది..

ఈ విచిత్ర సైకో సంఘటన పుప్పాలగుట్ట ప్రాంతంలో జరిగింది. అతను ఎవరో అక్కడివారికి తెలియదు. కానీ అతడు నేరుగా ఓ ఇంట్లోకి చొరబడ్డాడు.. ఇంట్లో ఉన్నవారిపై రాయితో దాడి చేశాడు. దీంతో వారి అరుపులు విన్న స్థానికులు హడలెత్తిపోయారు. ధైర్యం చేసి అతన్ని పట్టుకొని చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే..  శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి రెండు సంచులు చేత పట్టుకొని ఇంట్లోకి ప్రవేశించాడు. ఎవరు మీరని ప్రశ్నించడంతో అతడు ఆగ్రహం తో ఇంటి యాజమానిపై రాయితో దాడి చేశాడు. ఇంట్లో వారి అరుపులు విని ఇరుగు పొరుగు వారంతా అక్కడి చేరుకున్నారు. ఎవరు నువ్వని నిలదీయడం తో ఆసీఫ్ అనే మరోవ్యక్తిపై ఆ సైకో దాడికి పాల్పడ్డాడు.. అతను కూడా తీవ్రంగా గాయపడ్డారు..

ఇక అందరు దైర్యం చేసి గ్రామస్తులు అతన్ని అతి కష్టం మీద పట్టుకున్నారు.. అతని మానసిక స్తితి సరిగా లేదనని స్థానికులు గుర్తించారు. చివరికి అతడ్ని పట్టుకుని ఓ స్తంభానికి కట్టేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాని కి వచ్చిన అతడ్ని తీసుకెళ్లారు. అయితే దాదాపు రెండు గంటల పాటు ఆ సైకో సృష్టించిన వీరంగంతో జనాలు భయంతో వణికిపోయారు.. అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు.. పోలీసులు ప్రస్తుతం అతన్ని మానసిక వైద్యుల దగ్గర కు తీసుకెళ్లినట్లు తెలుస్తుంది.. ఈ ఘటన పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..