Ganja Seized: డ్రగ్స్ ముఠాల ఆటకట్టిస్తున్నారు పోలీసులు. సినిమాటిక్ రేంజ్‌లో రాష్ట్రవ్యాప్తంగా మెరుపుదాడులు చేశారు. కొన్ని గంటల్లోనే ఏకంగా 500 కిలోల గంజాయి, పెద్ద ఎత్తున్న ఇతర మాదకద్రవ్యాలు పట్టుకున్నారు పోలీసులు. ఈగల్ టీమ్… జీఆర్పీ.. ఆర్పీఎఫ్.. ఎక్సైజ్.. లా అండ్ ఆర్డర్.. ఇలా అన్ని విభాగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. మాదకద్రవ్యాల రవాణా ముఠాల తాటతీశాయి.
గంజాయి, డ్రగ్స్ రవాణా ముఠాలు రెచ్చిపోతున్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నా.. పైఎత్తులు వేస్తూ రకరకాల మార్గాల్లో రవాణా చేస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి బార్డర్లు దాటిస్తూ సిటీలోకి తెస్తున్నారు. ఈ ముఠాలపై నిఘా పెట్టిన పోలీసులు.. మెరుపు దాడులు చేశారు. అన్ని విభాగాలు కలిసి జాయింట్ ఆపరేషన్‌తో ముఠాల ఆటకట్టించారు. సినిమాటిక్ రేంజ్‌లో.. కేవలం కొన్ని గంటల్లోనే 500 కిలోల గంజాయి, పెద్ద ఎత్తున్న డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
Murder Attempt: శాడిస్ట్ మొగుడు.. అదనపు కట్నం కోసం భార్యపై హత్యాయత్నం!
జీఆర్పీ, ఆర్పీఎఫ్ సహకారంతో ఈగల్ టీమ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు జరిపారు. పోలీసుల కళ్లుగప్పి ప్యాసింజర్ల రూపంలో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. 91 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వరంగల్‌లోనూ తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. కొణార్క్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో 32 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. 8 లక్షలు ఉంటుందని చెప్తున్నారు పోలీసులు. ములుగు జిల్లా వాజేడు పరిధిలోనూ 30 కేజీల గంజాయి పట్టుకున్నారు పోలీసులు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
వరంగల్ జిల్లా ఐనవోలు పరిధిలో పెద్ద ఎత్తున్న గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి ఏకంగా 214 కిలోల గంజాయి తరలిస్తుండగా.. పట్టుకున్నారు పోలీసులు. వీటి విలువ దాదాపు 54 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు. సంగారెడ్డిలో ఆల్ప్రాజోలం తయారీ యూనిట్ ను గుట్టురట్టు చేశారు పోలీసులు. 270 గ్రాముల ఆల్ఫ్రాజోలంతోపాటు 7.8 కేజీల నోర్డయాజిపామ్ స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్ మాటున మత్తు పదార్థాలు తయారీ చేస్తున్న గౌండ్ల శ్రీనివాస్ గౌడ్, గౌండ్ల మల్లేశంను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రూ. 16.31 లక్షల విలువైన డ్రగ్స్‌తోపాటు .. తయారీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
Deer Meat In HYD: అంతేనేమో డాక్టర్.. చేసేదేమో గలీజ్ పని!
మరోవైపు హైదరాబాద్ శివారులో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతోంది. వారి ఆగడాలు రోజు రోజుకు శ్రుతి మించుతున్నాయి. గంజాయి బ్యాచ్ చేష్టలకు సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మత్తులో సామాన్య జనాన్ని తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు. రోడ్లపై వెళ్తున్న మహిళలు, యువతులను వేధిస్తున్నారు. హయత్ నగర్ వద్ద తండ్రీ, కొడుకులను గంజాయి బ్యాచ్ తీవ్రంగా కొట్టింది. ఎదురించిన వారిని తీసుకు వెళ్లి తీవ్రంగా దాడులకు పాల్పడుతోంది. తండ్రీ కొడుకును తీవ్రంగా కొట్టిన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో గంజాయి బ్యాచ్‌లో ఉన్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.