తెలంగాణాలో దారుణం వెలుగు చూసింది.. కామారెడ్డి జిల్లాలో బస్సు కోసం వెయిట్ చేస్తున్న మహిళను నమ్మించి బైకు పై ఎక్కించుకెళ్లి అతి దారుణంగా అత్యాచారం చేశాడు.. ఓ కామంధుడు..అంతటి ఆగక తన ఫ్రెండ్స్ తో కలిసి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టాడు..ఆ తర్వాత ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.. భాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు..
జుక్కల్ వెళ్లేందుకు ఖండే బల్లూరులో బస్సు కోసం మహిళ నిరీక్షిస్తుంది. మహిళ గ్రామానికి చెందిన యువకుడు బైక్ పై గ్రామానికి వెళ్తున్నాడు. ఈ బైక్ పై మరో యువకుడు కూడా ఉన్నాడు. బైక్ పై గ్రామానికి తీసుకెళ్తామని మహిళను నమ్మించారు. తమ గ్రామానికి చెందిన యువకుడేనని మహిళ నమ్మింది. బైక్ పై ఎక్కింది. గ్రామానికి వెళ్లే మార్గంలో నిర్మానుష్యప్రాంతంలో మహిళపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు..
ఆ తర్వాత బాధితురాలిని అక్కడే వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు.. ఆ ఘటన నుంచి తెరుకున్న మహిళ స్థానికుల సాయంతో ఇంటికి చేరింది.. ఆ తర్వాత జరిగిన విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పి పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది.. జరిగిన విషయాన్ని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..