Site icon NTV Telugu

Telangana: జగిత్యాలలో దారుణం..అన్నను రోకలిబండతో కొట్టి చంపిన తమ్ముడు..

Jagityala Murder

Jagityala Murder

ఈరోజుల్లో మనుషుల మధ్య మానవత్వం లేదు.. సంబంధ బాంధవ్యాలు కూడా సరిగ్గా ఉండటం లేదు.. డబ్బులు సంపాదించాలనే కోరిక తప్ప బంధం, బంధుత్వం అనేది లేకుండా పోయింది.. డబ్బుల కోసం సొంతవాళ్ళను సైతం పొట్టన పెట్టుకుంటున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి.. తాజాగా తెలంగాణాలో మరో దారుణం జరిగింది.. ఆస్తి కోసం సొంత అన్ననే అతి కిరాతకంగా చంపాడు ఓ తమ్ముడు ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామం ఉలిక్కి పడింది..

వివరాల్లోకి వెళితే.. తెలంగాణ జగిత్యాల జిల్లాలోని బుగ్గారం మండలం చిన్నాపూర్‌లో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన ఇడగొట్టు తిరుపతి ని పాత కక్షల నేపథ్యంలో తమ్ముడు శ్రీనివాస్ అతి దారుణంగా రోకలితో కొట్టి చంపిన ఘటన వెలుగు చూసింది..

ఆదివారం అర్ధరాత్రి ఇంటి బయట ఒంటరిగా నిద్రిస్తున్న తిరుపతిపై తమ్ముడు శ్రీనివాస్ రోకలిబండ తో దాడి చేసినట్లు తెలుస్తుంది. తలకు బలమైన గాయం కావడంతో తిరుపతి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై బుగ్గారం పోలీసులు సమాచారం అందడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు..  రక్తం పంచుకున్న అన్నదమ్ములు ఇలా ఆస్తి కోసం ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం.. అందరిని కలచివేస్తుంది.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి తగాదాలే హత్యకు కారణం అయి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

Exit mobile version