Site icon NTV Telugu

Uttar Pradesh: కేస్ విత్‌డ్రా చేసుకోవడం లేదని.. అత్యాచార బాధితురాలిని నరికి చంపిన నిందితుడు

Up Crime

Up Crime

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ కౌశాంబి జిల్లాలోని దేర్హా గ్రామంలో దారుణం జరిగింది. అత్యాచారం కేసును విత్ డ్రా చేసుకోవడం లేదని అత్యాచార బాధితురాలిని నిందితుడు, అతని ఇద్దరు సోదరులు అత్యంత దారుణంగా నరికి చంపారు. పట్టపగటు అందరూ చూస్తుండగా ఈ దాడికి ఒడిగట్టారు. హంతకులు అశోక్, పవన్ నిషాద్ కొన్ని రోజుల మందు బెయిల్‌పై విడుదలయ్యారని పోలీసులు మంగళవారం వెల్లడించారు.

గ్రామస్థులు నిస్సహాయంగా చూస్తుండగా.. నడిరోడ్డుపై గొడ్డలితో 19 ఏళ్ల యువతిని చంపేశారు. బాధితురాలు మూడేళ్ల క్రితం మైనర్‌గా ఉన్న సమయంలో పవన్ నిషాద్ తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. పవన్ గత కొంత కాలంగా తనపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని యువతిని వేధిస్తున్నాడు. అయితే పవన్, అతని సోదరుడు అశోక్ నిషాద్ వేరే హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. ఈ హత్య జరిగిన రెండు రోజుల ముందే వీరిద్దరు జైలు నుంచి బెయిల్‌పై బయలకు వచ్చారు. వీరిద్దరు కలిసి యువతి, ఆమె కుటుంబాన్ని బెదిరించి కేసు విత్‌డ్రా చేయించేలా పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు.

Read Also: Rahul Gandhi: ప్రధాని మోడీ “చెడు శకునం”.. అందుకే భారత్ ఓడిపోయింది..

అయితే బెదిరింపులకు భయపడని యువతి విత్‌డ్రా చేసుకునేందుకు నిరాకరించింది. సమీపంలోని పొలంలో పశువులను మేపుకుని తిరిగి వస్తుండగా.. నిందితులిద్దరు ఆమెపై దాడి చేసి నరికి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం పవన్, అశోక్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.

పాత కక్షల నేపథ్యంలో గొడవ జరిగిందని, పదునైన ఆయుధంతో బాలికను హతమార్చినట్లు ఎస్పీ బ్రిజేష్ శ్రీవాస్తవ చెప్పారు. అయితే ఈ హత్య రాష్ట్రంలో పొలిటికల్ వార్‌గా మారింది. బీజేపీ పాలనలో శాంతిభద్రతలను కాంగ్రెస్ ప్రశ్నించింది. అయితే ఇటీవల యూపీ సీఎం మహిళల రక్షణ గురించి మాట్లాడుతూ.. మహిళల్ని వేధించిన వారికి ‘యముడు’ ప్రతీకారం తీర్చుకుంటాడని హెచ్చరించిన రెండు నెలల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. 2021 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం..యూపీలో 56,000పైగా నేరాలు నమోదయ్యాయి. ఇవి దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ.

Exit mobile version