NTV Telugu Site icon

Maharashtra: తనను ఆటపట్టిస్తుందని 8 ఏళ్ల బాలికను చంపేసిన బాలుడు..

Crime

Crime

Maharashtra: తనను ఆటపట్టిస్తుందని 8 ఏళ్ల బాలికను చంపేసిన బాలుడు..తన పక్కింట్లోనే ఉండే 8 ఏళ్ల బాలికను 16 ఏళ్ల బాలుడు దారుణంగా హత్య చేశాడు. పదేపదే తనను ఆటపట్టిస్తుందని, ఏడిపిస్తుందనే కారణంతో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని పెల్హార్ గ్రామంలో డిసెంబర్ 1న ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన 3 రోజుల తర్వాత బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బాలిక మృతదేహాన్ని తరలించేందుకు సహకరించినట్లు బాలుడి తండ్రి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయనను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వయసు 16 ఏళ్లు అని వసాయ్ తాలూకాలోని పెల్హార్ పోలీస్ అధికారులు తెలిపారు.

గత శుక్రవారం ఐస్‌‌క్రీం కొనేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత బాలిక కనిపించకుండాపోయింది. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బాలిక కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు. డిసెంబర్ 4న ఒక నిర్మానుష్య ప్రదేశంలో ప్లాస్టిక్ బ్యాగులో కుళ్లిపోయిన స్థితిలో బాలిక మృతదేహం కనిపించింది. దీంతో గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు హత్య, కిడ్నాప్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Read Also: IT Raids: ఒడిశా వ్యాప్తంగా ఐటీ దాడులు.. రూ.200 కోట్లు స్వాధీనం..

అయితే, విచారణ చేస్తున్న క్రమంలో పక్కింటిలో ఉంటున్న బాలుడు కూడా అదృశ్యమైనట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో బాలుడే హత్య చేసినట్లు కనుగొన్నారు. బాలిక తనను ఎప్పుడూ ఆటపట్టిస్తుండటంతో కోపంతోనే ఆమెకు గుణపాఠం చెప్పాలని హత్య చేసినట్లు అంగీఅకరించాడు. డిసెంబర్1న బాలికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి తీసుకువచ్చి గొంతు కోసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.

చంపేసిన తర్వాత మృతదేహాన్ని ఏం చేయాలో తెలియ రెండు రోజుల పాటు ఇంట్లోనే దాచిపెట్టాడని, ఆ తర్వాత తండ్రికి విషయం తెలిపాడని, ఇద్దరూ కలిసి ఎవరూ లేని గదిలో మృతదేహాన్ని దాచిపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల ఇంటి ముందు బాలిక చెప్పులు కనిపించడంతో వీరిపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ హత్య తర్వాత బాలుడి తండ్రి అతడిని జాల్నా జిల్లాలోని స్వగ్రామానికి పంపాడు. ప్రస్తుతం పోలీసులు బాలుడిని అరెస్ట్ చేసి పెల్హార్ తీసుకువచ్చారు. తదుపరి విచారణ జరుగుతోంది.

Show comments