Site icon NTV Telugu

Ahmedabad: మైనర్ బాలికని లేపుకెళ్లిన యువకుడు.. బాలిక కుటుంబం చేతిలో తల్లి హతం..

Crime

Crime

Ahmedabad: పొరుగున ఉన్న మైనర్ అమ్మాయిని ఓ యువకుడు లేపుకుపోవడం ఇరు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణకు కారణమైంది. చివరకు యువకుడి తల్లి హత్యకు దారి తీసింది. అహ్మదాబాద్ లోని మన్సాలోని జరిగిన విషాద సంఘటనలో శిల్పా ఠాకూర్ అనే మహిళని కొట్టడంతో ఆమె చనిపోయింది. బాలిక తిరిగి వచ్చిన వారం తర్వాత ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.

Read Also: Tutankhamun: ఎట్టకేలకు ఈజిప్టు రాజు ‘‘టూటన్‌ఖామున్ శాపం’’ అసలు నిజాలు తెలిశాయి..

మన్సాలోని రిధోల్ గ్రామానికి చెందిన మహేష్ ఠాకూర్ అనే వ్యక్తి తన 19 ఏళ్ల కిషన్ తమ ప్రాంతంలోని మైనర్ బాలికతో పారిపోయాడని ఫిర్యాదు చేశాడు. అనంతరం బాలిక కుటుంబం కూడా ఏప్రిల్ 19న కిషన్‌పై ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత కిషన్, సదరు మైనర్ బాలిక తమతమ ఇళ్లకు తిరిగి వచ్చారు. తదనంతర పరిణామాల్లో ఠాకూర్ కుటుంబం తమ నివాసాన్ని తాత్కాలికంగా చరదాకు మార్చింది. శుక్రవారం బాలిక కుటుంబం, ఠాకూర్ ఫ్యామిలీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ క్రమంలో పరిస్థితి విషమించింది. ఠాకూర్ కుటుంబంపై దాడి చేశారు. ఈ క్రమంలో గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నించి శిల్పాఠాకూర్‌‌పై కర్రలు, కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో మహేష్ ఠాకూర్ తల్లి గాజీ ఠాకూర్, తండ్రి మోహన్ ఠాకూర్లకు కూడా గాయాలయ్యాయి. శిల్పా అక్కడికక్కడే మరణించగా.. గాజా, మోహన్ భాయ్‌లను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మైనర్ బాలిక కుటుంబంపై హత్యా నేరం నమోదు చేశారు. ఘటన తర్వాత నుంచి కుటుంబం పరారీలో ఉంది.

Exit mobile version