TCS Nashik Case: నిదా ఖాన్ ప్రెగ్నెంట్.. “టీసీఎస్ నాసిక్ కేసు”లో ముందస్తు బెయిల్ పిటిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆఫీసుల్లో ఉన్నత స్థానంలో ఉన్న ముస్లిం ఉద్యోగులు హిందూ యువతులు, తమ కింద పనిచేసే ఇతర ఉద్యోగుల మతపరమైన మనోభావాలను దెబ్బతీయడంతో పాటు, పెళ్లి పేరుతో మహిళలతో లైంగిక సంబంధం పెట్టుకోవడం, లైంగిక వేధింపులు, మతమార్పిడికి పాల్పడటం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. ఇప్పటికే ఈ కేసులో 8 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. మరో నిందితురాలు నిదా ఖాన్ పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉంటే, నిదా ఖాన్ తరపు న్యాయవాది ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఈ దరఖాస్తు నాసిక్ కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. నిదాఖాన్ ప్రస్తుతం ముంబైలో ఉన్నారని, ఆమె తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారని ఆమె కుటుంబీకులు తెలిపారు. పరారీలో ఉన్న సమయంలోనే నిదా ఖాన్ బెయిల్ కోసం స్థానిక కోర్టును ఆశ్రయించారు. తన బెయిల్ పిటిషన్‌లో వైద్య పరిస్థితిని కీలక అంశంగా ప్రస్తావించే అవకాశం ఉంది.
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
ఇప్పటి వరకు ఈ కేసులో డానిష్ షేక్, తౌసిఫ్ అత్తర్, రజా మెమన్, షారుఖ్ ఖురేషి, షఫీ షేక్, ఆసిఫ్ అఫ్తాబ్ అన్సార్, షారుఖ్ షేక్, టీసీఎస్ BPO యూనిట్ ఆపరేషన్స్ హెడ్ అరెస్టులు జరిగాయి. టెలికాలర్‌గా పనిచేస్తున్న నిదా ఖాన్, బాధిత మహిళలు చేసిన ఫిర్యాదులను పట్టించుకోలేదు. ఫిర్యాదు చేస్తున్నవారిని నిరుత్సాహపరిచేలా వ్యవహరించారు. కార్పొరేట్ వరల్డ్‌లో ఇదంతా సహజమే అంటూ బాధితులను కించపరిచారని తెలుస్తోంది. 25 ఏళ్ల నిదాఖాన్, 2021లో నాసిక్ టీసీఎస్ బీపీఓలో ఉద్యోగంలో చేరారు.
ఈ కేసులో ఇప్పటి వరకు 9 మంది బాధితులు మందుకు వచ్చారు. ఇందులో 8 మంది మహిళలు కాగా, ఒక పురుషుడు ఉన్నాడు. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ కేసులో వేధింపులు 2022 నుంచి 2026 మధ్య జరిగినట్లు విచారణలో తేలింది. అయితే, ఈ మతమార్పిడి, కార్పొరేట్ జిహాద్ వెనక అంతర్జాతీయ కుట్ర ఉందా.? అనే కోణంలో కూడా విచారణ సాగుతోంది.
నిందితుల్లో ఒకరు, సహోద్యోగిని పెళ్లి చేసుకుంటానని తప్పుడు వాగ్దానం చేసి, పదేపదే ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఉద్యోగులలో ఒకరిని అసభ్యం తాకడం వంటి చర్యలకు పాల్పడినట్లు తేలింది. టీమ్ లీడర్ పొజిషన్లలో ఉన్న నిందితులు తన కింది ఉద్యోగినికి మతపరమైన టోపీని ధరింపచేసి, నమాజ్ చేయాలని ఒత్తిడి తీసుకువచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితులను ఇప్పటికే టీసీఎస్ సస్పెండ్ చేసింది. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తామని టీసీఎస్ చెప్పింది
తాజావార్తలు
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!