NTV Telugu Site icon

Tamil Nadu: ఏటీఎం దోపిడీ ముఠాపై ఎన్‌కౌంటర్.. ఒకరు హతం.. నలుగురు అరెస్ట్

Tamilnadupoliceencounter

Tamilnadupoliceencounter

ఏటీఎం దోపిడీ ముఠాపై తమిళనాడు పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఘటనలో ఒక దొంగ మరణించగా.. మరో దొంగకు గాయాలయ్యాయి. మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

త్రిసూర్ జిల్లాలో ఓ దొంగల ముఠా ఏటీఎం దోపిడీకి పాల్పడింది. దోచుకున్న నగదు, ఆయుధాలతో కంటైనర్ లారీలో పరారవుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు అత్యంత వేగంగా ఛేజింగ్ చేశారు. ఆపేందుకు నిరాకరించడంతో పొరుగు రాష్ట్రమైన కేరళలో నిందితుడిని పోలీసులు కాల్చిచంపారు. గంట పాటు వెంటాడారు. దీంతో దొంగలు ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు కూడా ఎదురుకాల్పులకు దిగారు. ఎన్‌కౌంటర్‌లో ఒక దొంగ చనిపోయాడు. మరో దొంగకు గాయాలయ్యాయి. లారీ, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నామక్కల్ జిల్లా కుమారపాళయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: YS Jagan: రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోంది..

నామక్కల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) రాజేష్ ఖన్నా నేతృత్వంలోని బృందం వాహనాన్ని వెంటాడింది. పోలీసులు దానిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. పదే పదే విజ్ఞప్తి చేసినా ముఠా  ఆపడానికి నిరాకరించారు. బదులుగా వారు పోలీసులపై కాల్పులు జరిపారు. ఇద్దరు అధికారులు ఇన్‌స్పెక్టర్ తవమణి, సబ్-ఇన్‌స్పెక్టర్ రంజిత్ గాయపడ్డారు. దీంతో పోలీసులు ప్రతీకారం తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఎన్‌కౌంటర్‌ చేశారు. బుల్లెట్ తగిలి ఒక అనుమానితుడు మరణించాడు.

ఇది కూడా చదవండి: Mrs. India 2024: తెలుగు హీరోయిన్ కి గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు

దొంగలు హర్యానా లేదా రాజస్థాన్‌కు చెందినవారిగా అనుమానిస్తున్నారు. పలు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. మూడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలను దోచుకుని రూ.65 లక్షలకు పైగా దోచుకెళ్లారు. కంటైనర్‌లో కారు, ఏటీఎం ఉన్నట్టు పోలీసులు వీడియోను విడుదల చేశారు.

ఇది కూడా చదవండి: Viral News: భార్య బికినీ వేసుకుని తిరిగేందుకు “దీవి”నే కొనేసిన భర్త.. ఎన్ని కోట్లో తెలుసా?(వీడియో)