Site icon NTV Telugu

Tamil Nadu: భార్యపై దాడి చేసి, ఆస్పత్రిలో ఉన్నా కనికరం లేకుండా దారుణహత్య..

Tamil Nadu

Tamil Nadu

Tamil Nadu: తమిళనాడులో దారుణం జరిగింది. భార్యపై కోపంతో ఏకంగా ఆమెను పొడిచి చంపేశాడు ఓ భర్త. రాష్ట్రంలోని కరూర్ జిల్లాలోని కులితలై ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి చంపేశాడు. నిందితుడిని విశృత్‌గా గుర్తించారు. ఘటన తర్వాత అక్కడ నుంచి పారిపోయిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read Also: Delay in Marriage: జాతకంలో ఈ దోషం ఉంటే పెళ్లి ఆలస్యం.. నివారణ మార్గాలు ఇవే..

శనివారం రాత్రి విశృత్ అతడి భార్య 27 ఏళ్ల శ్రుతి మధ్య కరూర్‌లోని వారి ఇంట్లో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో శ్రుతిపై విశృత్ దాడి చేశాడు. దీంతో ఆమెను చికిత్స కోసం కులితలై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆదివారం ఉదయం ఆమెను చూసే నెపంతో, విశృత్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. శ్రుతిని అనేక సార్లు పొడిచి, ఆమెను అక్కడిక్కడే చంపాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆస్పత్రి సిబ్బంది, చుట్టుపక్కల వారు షాక్ అయ్యారు. అతడిని పట్టుకునే లోపే పారిపోయాడు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇటీవల నెలల్లో తమిళనాడు వ్యాప్తంగా ఇలాంటి కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. జూన్‌లో తిరునల్వేలిలోని మారిముత్తుమన్ తన భార్య కాంతివల్లిని తగలపెట్టి, హత్య చేశాడు. వెల్లూర్‌లో రాజేష్ కుమార్ అనే వ్యక్తి, విడిపోయిన భార్యపై కొడవలితో దాడి చేసి చంపేవాడు.

Exit mobile version