Gadwal Murder Twist: గద్వాల జిల్లా సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో రోజుకో కొత్త మలుపు వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు ప్రధాన కుట్రదారుడిగా పోలీసులు గుర్తించారు. తాజా దర్యాప్తులో అతను తేజేశ్వర్ హత్య తర్వాత తన భార్యను కూడా హత్య చేయాలనే పథకం వేసినట్టు వెల్లడైంది. తిరుమలరావు, ఐశ్వర్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. వివాహమైన 8 సంవత్సరాలయినా సంతానం లేని పరిస్థితుల్లో, ఐశ్వర్యతో పిల్లలు కనాలని అతనికి వాంఛ కలిగింది. ఈ కారణంగా తన భార్యతో పాటు ఐశ్వర్య జీవితంలో అడ్డుగా ఉన్న సర్వేయర్ తేజేశ్వర్‌ను కూడా తొలగించాలనుకున్నాడు. ఈ క్రమంలోనే తేజేశ్వర్‌ను హత్య చేయడానికి సుపారీ గ్యాంగ్‌ను నియమించినట్టు తెలుస్తోంది.
Top Headlines @1PM : టాప్ న్యూస్
జూన్ 17న, నగేష్, పరుశురాం, రాజు అనే ముగ్గురు కలిసి ల్యాండ్ సర్వే నిమిత్తంగా కారులో తేజేశ్వర్‌ను తీసుకెళ్లారు. అనంతరం ప్లాన్ ప్రకారం ముందురోజే బ్యాంకు నుంచి 20 లక్షలు డ్రా చేసిన తిరుమలరావు, హత్య అనంతరం 2 లక్షల రూపాయల నగదును హంతకులకు చెల్లించాడు. తేజేశ్వర్‌ను కత్తితో పొడిచిన అనంతరం మృతదేహాన్ని కర్నూల్ శివారులో పడేసి, తిరుమలరావుకు చూపించారు సుపారీ గ్యాంగ్.
ఇక.. హత్య తర్వాత ఐశ్వర్యతో కలిసి లడఖ్ వెళ్లాలన్న పథకం ప్రకారం, ఐశ్వర్య తన తల్లికి ఫోన్ చేసి కొన్ని దుస్తులు కూడా తెప్పించుకుంది. పోలీసులు ఆమెను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు, ప్రధాన నిందితుడు తిరుమలరావును పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. అతను లడఖ్‌కు వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.