Site icon NTV Telugu

Affair: వదినతో అక్రమ సంబంధం.. తల్లిని హత్య చేసిన చిన్న కొడుకు..

Crime News

Crime News

Affair: క్షణకాలం సుఖం కోసం సంసారాలను, జీవితాలనే పణంగా పెడుతున్నారు కొందరు. అక్రమ సంబంధాల మాటున హత్యలు, ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా గుజరాత్‌లో జరిగిన ఒక సంఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. అక్రమ సంబంధాన్ని వ్యతిరేకించిందని తల్లినే హత్య చేశాడు ఓ కొడుకు. 55 ఏళ్ల మహిళ హమీదా ఖాతూన్‌‌ను ఆమె చిన్న కుమారుడు పర్వేజ్, పెద్ద కోడలు షబానా, కోడలు తండ్రి ఫిరోజ్ ఆలం కలిసి దారుణంగా హత్య చేశారు.

Read Also: Monalisa: “మోనాలిసా 35 ముక్కలుగా దొరుకుతుంది”.. సాధ్వీ ప్రాచీ సంచలన వ్యాఖ్యలు..

హమీదా చిన్న కుమారుడు పర్వేజ్‌కు అతడి అన్నయ్య భార్య షబానాకు మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. దీనిని హమీదా తీవ్రంగా వ్యతిరించేది. దీంతో తరుచుగా వీరి మధ్య గొడవలు జరుగుతుండేవి. అయితే, తమ సుఖానికి అడ్డంగా ఉందనే కారణంతో షబానాను కొడుకు, కోడలు కలిసి హత్య చేశారు. దీనికి కోడలు తండ్రి ఫిరోజ్ సహకరించారు. మార్చి 10న ముగ్గురు నిందితులు కలిసి హమీదా గొంతు కోసి హత్య చేశారు. శవాన్ని ఒక ప్లాస్టిక్ సంచిలో చుట్టి, కాళ్లు చేతులను తాళ్లతో బిగించి ఒక గుడి సమీపంలో పారేశారు.

ముందుగా పోలీసుల్ని బురిడి కొట్టించాలని నిందితులు ప్లాన్ చేశారు. తన తల్లి మార్కెట్‌కు వెళ్లి రాలేదని, కనిపించకుండా పోయిందని మిస్సింగ్ కేసు పెట్టారు. అయితే, సూరత్ క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగడంతో అన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. శవానికి కట్టిన తాళ్లు, హమీదా ఇంట్లోని తాళ్లు ఒకే రంగులో ఉండటం, షబానా తండ్రి శవం ఉంచిన సంచిని మోసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. దీంతో పోలీసులు ఈ కేసును చేధించారు. ర్వేజ్, షబానా సూరత్‌లో పట్టుబడగా, బీహార్‌కు పారిపోయిన ఫిరోజ్ ఆలాన్ని పాట్నా రైల్వే స్టేషన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.

Exit mobile version