Warangal CI: ప్రజలను కాపాడిల్సిన రక్షక భటులే ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారు. కామాంధుల నుంచి కాపాడిల్సిన వారే కామాంధులుగా మారి మహిళలను వేధిస్తున్నారు. తాజాగా ఒక సీఐ ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలపై లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. డబ్బులు ఇస్తావా.. లేక నాతో వస్తావా అంటూ వారిని వేధింపులకు గురిచేస్తున్న వరంగల్ సీఐ బండారం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. సుబేదారి ఉమెన్ పోలీస్ స్టేషన్ లో సతీష్ కుమార్ సీఐ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ మధ్యనే అతడి వద్దకు ఒక మహిళ తన భర్తపై ఫిర్యాదు చేయడానికి వచ్చింది.
తన భర్త కొంతమంది మహిళల న్యూడ్ వీడియోలు తీసి బెదిరిస్తున్నాడని, అతడిని ఎలాగైనా అరెస్ట్ చేసి మహిళల వీడియోలను డిలీట్ చేయించమని కోరింది. అయితే డబ్బు పిచ్చి ఉన్న సతీష్.. రూ. 50 వేలు లంచం అడిగాడు. అందుకు ఆమె తనవద్ద అంత డబ్బులేదని చెప్పడంతో ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. డబ్బులిస్తావా.. నువ్వు వస్తావా.. లేక మీ ఆయన న్యూడ్ వీడియోలను బయట పెట్టమంటావా అంటూ బెదిరింపులకు గురిచేశాడు. ఇక సతీష్ ఆగడాలను తట్టుకోల్ని సదురు మహిళ అతడిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో సతీష్ గురించి విచారించిన ఉన్నతధికారులు అతడికి ఇదేమి కొత్తకాదని చాలామంచి మహిళలను డబ్బు కోసం లైంగికంగా వేధించారని రుజువు అవ్వడంతో అతడిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త వరంగల్ లో సంచలనం సృష్టిస్తోంది.