Site icon NTV Telugu

Bihar Student Death: ధూమపానం చేస్తున్నాడని విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయులు.. మరణించిన స్టూడెంట్‌

Bihar Student

Bihar Student

Bihar Student Death: విద్యార్థులకు ఉపాధ్యాయులు విద్యా బుద్దులు నేర్పిస్తారు. మంచి అలవాట్లు నేర్పిస్తారు. అలాగే సోసైటీ మంచి పౌరులుగా ఎలా ఉండాలో నేర్పిస్తారు. విద్యార్థులు తప్పు చేస్తే దండించే అధికారం ఉపాధ్యాయులకు ఉంటుంది.. కానీ మరీ చనిపోయేటట్టు, ఆరోగ్యాలు పాడయ్యేటట్టు దండించే అధికారం మాత్రం ఉపాధ్యాయులకు ఉండదు. కానీ బీహార్‌లో మాత్రం తమ పాఠశాలకు చెందిన విద్యార్థి ధూమపానం చేస్తుండగా చూసి.. అతన్ని దండించడానికి ఉపాధ్యాయులు తీవ్రంగా కొట్టారు. దీంతో దెబ్బలను తట్టుకోలేక విద్యార్థి మరణించాడు. ఈ ఘటన బీహార్‌ రాష్ట్రంలో జరిగింది.

Read also: Keerthi Suresh : కీర్తి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతుందా…?

బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాకు చెందిన బజరంగీ కుమార్ తన తల్లి మొబైల్ ఫోన్‌ను రిపేరింగ్ షాప్ నుండి తిరిగి తీసుకువెళ్లడానికి శనివారం ఉదయం 11.30 మధుబన్ ప్రాంతానికి వెళ్లాడు. ఇంటికి తిరిగి వస్తుండగా హార్దియా వంతెన కింద తన స్నేహితులతో కలిసి ధూమపానం చేశాడని విద్యార్థి బంధువులు తెలిపారు. ఆ సమయంలో బజరంగీ చదువుతున్న ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్‌కి చెందిన మధుబన్ రైజింగ్ స్టార్ ప్రిపరేషన్ స్కూల్‌ ఛైర్మన్ విజయ్ కుమార్ యాదవ్ విద్యార్థి పొగతాగడం చూసి కోపంతో రగిలిపోయాడు. ఆ సమయంలో బాలుడి బంధువు అయిన పాఠశాల ఉపాధ్యాయుడు కూడా చైర్మన్‌ వెంట ఉన్నారు. ఘటన జరిగిన తరువాత ఛైర్మన్ బాలుడి తండ్రికి విషయం చెప్పాడు. తరువాత విద్యార్థిని పాఠశాల కాంపౌండ్‌కు ఈడ్చుకెళ్లి అక్కడ ఇతర ఉపాధ్యాయులతో కలిసి కనికరం లేకుండా కొట్టారని బజరంగి తల్లి, సోదరి ఆరోపించారు. ఉపాధ్యాయులు బాలుడిని బట్టలు విప్పి బెల్టులతో కొట్టారని వారు తెలిపారు.ఉపాధ్యాయులు కొట్టిన దెబ్బలకు బజరంగి స్పృహతప్పి పడిపోయాడు. దీంతో అతన్ని మధుబన్‌లోని ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌కు తరలించారు, అయితే కేసు తీవ్రత కారణంగా ముజఫర్‌పూర్‌కు తీసుకెళ్లాలని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. బజరంగీ అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. బజరంగీ మెడ, చేతులపై లోతైన గాయాలు ఉన్నాయని బంధువులు చెబుతున్నారు. విద్యార్థికి చెందిన ప్రైవేట్ పార్ట్స్ కూడా రక్తస్రావం అవుతున్నాయని వారు ఆరోపించారు.

Read also: OG: ఈ అప్డేట్స్ ఏంటో… ఆ సినిమా ఏంటో… అప్పుడే 50% అయిపోవడం ఏంటో…

అయితే పాఠశాల ఛైర్మన్ విద్యార్థి బంధువులు చెప్పేది నిజం కాదని.. బాలుడిని కొట్టలేదని, అతను పొగతాగుతున్నాడని అతని కుటుంబానికి తెలిసిపోతుందనే భయంతో విద్యార్థే విషం సేవించాడని చెప్పాడు. చికత్స కోసం అతడిని ముజఫర్‌పూర్‌కు తరలించినప్పటికీ ప్రాణాలతో బయటపడలేదని ఆయన చెప్పారు. రెండు నెలల క్రితమే బజరంగి స్కూల్ హాస్టల్‌లో అడ్మిషన్ పొంది, వేసవి సెలవుల కోసం ఇంటికి వచ్చాడని తెలిపారు. బాలుడి మరణ వార్త తెలియగానే అతని కుటుంబంలో ఆందోళన నెలకొంది. బజరంగి తల్లి, ఉస్మిలా దేవిని ఎవరు ఓదార్చలేకుండా పోయారు. జరంగీ తండ్రి హరి కిషోర్ రాయ్ కూలీ పని కోసం ఐదు రోజుల క్రితం పంజాబ్‌కు వెళ్లాడు.
బాలుడి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మోతీహరికి పంపామని.. పాఠశాలకు సీలు వేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Exit mobile version