Site icon NTV Telugu

Madhya Pradesh: ఎవర్రా మీరు.. “స్పీడ్ బ్రేకర్ల”ను దొంగిలించడం ఏంట్రా..

Mp

Mp

Madhya Pradesh: ఎవరైనా బంగారం, డబ్బు లేదా ఇంట్లోని ఇతర విలువైన వస్తువులు దొంగిలిస్తారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ దొంగతనం మాత్రం విచిత్రంగా ఉంది. విదిష జిల్లాలో ట్రాఫిక్ వేగాన్ని నియంత్రించడానికి రోడ్లపై ఏర్పాటు చేసిన ‘‘స్పీడ్ బ్రేకర్’’లను దొంగిలించారు. ఇటీవల, విదిష మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు రూ. 8 లక్షల ఖర్చుతో ఈ స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసింది.

Read Also: Uddhav Thackeray: మోడీని ప్రధాని చేయాలని నేనే చెప్పా..

అయితే, నగరంలోని దుర్గాపూర్ జంక్షన్, జిల్లా కోర్టు, వివేకానంద చౌక్ మధ్య ఉన్న ప్రాంతాలతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో వీటిని అమర్చారు. రాత్రిపూట దొంగలు వీటిని దొంగిలించారు. 24 గంటలు ట్రాఫిక్ కదలికలు ఉన్నప్పటికీ, పోలీసుల పెట్రోలింగ్ జరుగుతున్నప్పుడు, భద్రత కలిగిన ప్రాంతాల నుంచి వీటిని ఎవరూ చూడకుండా దొంగలు తీసుకెళ్లారు.

ఈ సంఘటన సాధారణ ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ప్రధాన రహదారులపై ఉన్న స్పీడ్ బ్రేకర్లు దొంగిలిస్తే, సామాన్య పౌరుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ అధికారులు ఈ చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలు వీటిని ఎలా తొలగించి, ఎక్కడికి తీసుకెళ్లారని తెలుసుకునేందుకు పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను స్కాన్ చేస్తున్నారు.

Exit mobile version