Site icon NTV Telugu

Sons Kill Father: రూ. 3 కోట్ల బీమా డబ్బుల కోసం తండ్రిని చంపిన కొడుకులు..

Csk

Csk

Sons Kill Father: చెన్నైలో జరిగిన ఈ దారుణ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మూడు కోట్ల రూపాయల బీమా డబ్బుల కోసం కన్న తండ్రినే హత్య చేసిన ఘటన తిరువళ్లూరు జిల్లా పోదటూరుపేటలో వెలుగులోకి వచ్చింది. అప్పులు, జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు కొడుకులు ఈ నేరానికి పాల్పడ్డారు. అయితే, పోదటూరుపేటకు చెందిన గణేశన్‌కు ఇద్దరు కుమారులు మోహన్ రాజ్‌, హరి హరన్‌.. వీరిద్దరికి అప్పుల భారం పెరగడంతో పాటు విలాస జీవనానికి అలవాటు పడటంతో.. ఈజీ మనీ కోసం తండ్రినే టార్గెట్ చేసుకున్నారు. ఆరు నెలల క్రితమే గణేశన్ పేరుతో భారీ మొత్తానికి బీమా చేయించి, ఆయనను హత్య చేయాలని పక్కా ప్రణాళిక రచించారు.

Read Also: India T20 World Cup Squad: టీం నుంచి గిల్, జితేష్ ఔట్.. టీమిండియాకు నష్టమా లేదా వ్యూహాత్మకమా?

ఇక, తండ్రి మరణాన్ని సహజ ఘటనలా చూపించేందుకు పాము కాటు నాటకం ఆడారు ఇద్దరు కొడుకులు. మొదటిసారి తాచుపాముతో కాటు వేయించే ప్రయత్నం విఫలం కావ్వడంతో, మరోసారి ప్లాన్ మార్చారు. ఈసారి ఏకంగా తండ్రి గణేశన్ మెడకే తాచుపామును చుట్టి ప్రాణాలు తీసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే, పాము కాటు ఘటన సమయంలో కొడుకుల ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో సంబంధిత బీమా కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చివరకు గణేశన్‌ను హత్య చేసిన అతని ఇద్దరు కుమారులను అరెస్ట్ చేశారు.

Exit mobile version