Site icon NTV Telugu

Shocking: డీజే రిపేర్‌కి డబ్బులు ఇవ్వలేదని.. ఫ్రెండ్‌తో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు..

Son, His Friends Kill Woman

Son, His Friends Kill Woman

Shocking: ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. కొడుకు తన స్నేహితులతో కలిసి తల్లిని దారుణంగా హత్య చేశాడు. ఇటీవల మహిళ మృతదేహం లభించింది. దీనిపై విచారించిన పోలీసులు.. సొంత కొడుకే హత్యకు పాల్పడినట్లు వెల్లడైంది. డీజే మిక్సర్ రిపేర్ కోసం డబ్బులు అడిగితే, తల్లి నిరాకరించడంతోనే హత్య చేసినట్లు తెలుస్తోంది. కొడుకు, అతడి ఫ్రెండ్స్‌ని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Read Also: Pushpa 2: ఒక్క నాన్ థియేట్రికల్ మీదే 420 కోట్లు.. ఇది సార్ పుష్ప గాడి రేంజు!

సుధీర్ తన తల్లి సంగీతను డీజే రిపేర్ కోసం రూ. 20,000 అడిగాడు. అయితే, తన కొడుకు వ్యసనాలకు బానిసయ్యాడని అనుమానించిన సంగీత డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది. సంగీత చిన్న బట్టల ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. కోపం పెంచుకున్న సుధీర్ అక్టోబర్ 03వ తేదీన సంగీతను బైక్‌పై ఎక్కించుకుని స్నేహితులు అంకిత్, సచిన్ ఉన్న చోటుకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె తలపై ఇటుకలతో కొట్టి హత్య హత్య చేశారు. మృతదేహాన్ని ట్రోనికా సిటీ ప్రాంతంలో పడేసి పారిపోయారు.

ఈ హత్యలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కొడుకే నేరస్తుడని తేలింది. సుధీర్‌కి ఉద్యోగం లేదని, కొన్ని సార్లు డీకేగా పనిచేసేవాడని పోలీసుల విచారణలో తేలింది. డీజే కన్సోల్ రిపేర్‌ కోసం రూ. 20,000 అడిగితే సంగీత ఇవ్వనందుకే హథ్య జరిగిందని, ముగ్గురికి కూడా ఎలాంటి నేరచరిత్ర లేదని పోలీసులు తెలిపారు.

Exit mobile version