Site icon NTV Telugu

Gachibowli: సాప్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య..? స్నేహితుడికి మెసేజ్..!

Krithi

Krithi

గచ్చిబౌలి లో మహిళ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య కలకలం రేపింది. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న జమ్మూ కాశ్మీర్ కు చెందిన కృతి సంబ్యాల్ ఆత్మహత్యకు పాల్పడింది. ఫ్లాట్ లో ఇద్దరి రూమ్ మేట్స్ తో కలిసివుంటున్న ఆమె. రూప్ ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఈ ఘాతుకానికి పాల్ప‌డింది. ఒక స్నేహితురాలు ఢిల్లీ వెల్ల‌గా మ‌రో స్నేహితురాలు ఆఫీస్ వెల్ల‌డంతో.. ప్లాట్ లో ఒంట‌రిగా వుంటున్న కృతి ఆత్మ‌హ‌త్య‌కు చేసుకుంది. త‌ను ఆత్మ‌హ‌త్య చేసుకునే ముందు త‌న స్నేహితుడు స‌చిన్ కుమార్ కు కృతి చ‌నిపోతున్న‌ట్లు వాట్స‌ప్ మెసేజ్ పంపింది.

ఆ మెసేజ్ చూసి షాక్ తిన్న స‌చిన్ హుటా హుటిన కృతి వుంటున్న ప్లాట్ ద‌గ్గ‌ర వ‌చ్చి చూడ‌గా రూమ్ కు తాళం వేసివుంది. దీంతో కృతికి కాల్ చేశాడు. ఎంత‌కూ ఫోన్ కాల్ కు కృతి స్పందించ‌క‌పోవ‌డంతో.. రూమ్ త‌లుపులు ప‌గ‌ల గొట్టి లోనికి వెళ్లాడు. కానీ అప్ప‌టికే కృతి ఉరికి వేలాడుతుంది. స్నేహితులు ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

అప్పటికే కృతి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో.. స్నేహితులు బోరున విల‌పించారు. చిన్న పాటి స‌మ‌స్య‌ల‌కు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌డం స‌రికాద‌ని దానికి ప‌రిష్కార మార్గాలు వుంటాయ‌ని ఈ తొంద‌రి పాటు నిర్ణ‌యం వ‌ల్ల కుటుంబాల‌కు తీర‌ని విషాద‌మ‌ని, ఇలాంటి ఆత్మ‌హ‌త్య‌లు పాల్ప‌వ‌ద్ద‌ని పోలీసులు వివ‌రించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Congress : ఆలేరు కాంగ్రెస్ లో నేతల వార్.. ఒక్క సీటుకు ఐదుగురు పోటీ

Exit mobile version