Site icon NTV Telugu

Visakhapatnam: అమానుషం.. 8వ తరగతి విద్యార్థిపై టీచర్‌ దాడి.. మూడు చోట్ల విరిగిన ఎముకలు..!

Visakhapatnam

Visakhapatnam

Visakhapatnam: విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే విచక్షణ కోల్పోతున్నారు.. విద్యార్థులపై విరుచుకుపడుతున్నారు.. అప్పడప్పుడు ఈ ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లో మరో ఘటన బయటపడింది.. విశాఖపట్నం మధురవాడలోని శ్రీ తనుష్ పాఠశాలలో అమానుష ఘటన చోటుచేసుకుంది… సదరు పాఠశాలలో 8వ తరగతి చదువుతోన్న విద్యార్థి చేయి విరగొట్టాడు ఉపాధ్యాయుడు.. ఇనుప బల్ల కేసి చితకబాది.. ఆపై పిడుగులు గుద్ధి చేయి విరగగొట్టాడు అని విద్యార్థి తల్లితండ్రులు చెబుతున్నారు.. ఈ ఘటనలో మూడు చోట్ల బాలుడి ఎముకలు విరిగాయి.. దీంతో, శస్త్ర చికిత్స కోసం విద్యార్థిని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు.. విద్యార్థిపై దాడికి కారణమైన సోషల్‌ మాస్టర్ మోహన్‌.. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.. ఈ ఘటనపై నిలదీయగా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారట స్కూల్ ప్రిన్సిపల్ పిళ్లా శివ సత్యనారాయణ.. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు విద్యార్థి తల్లిదండ్రులు… ఇక, స్కూల్ వద్ద సదరు విద్యార్థి తల్లిదండ్రులు, కాలనీవాసుల ఆందోళనకు దిగారు.. పీఎం పాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Read Also: Google Pixel: గూగుల్ పిక్సెల్ ఫోన్ పై క్రేజీ డీల్.. రూ. 10 వేల డిస్కౌంట్..

Exit mobile version