NTV Telugu Site icon

MP Revenge Story: పదేళ్ల నాటి పగ.. పట్టపగలే ఆరుగురిని కాల్చి చంపారు

Mp Revenge Story1

Mp Revenge Story1

Six of family gunned down in Madhya Pradesh revenge killing: మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం పట్టపగలే.. కొందరు దుండగులు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తుల్ని కాల్చి చంపారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురిని ఆసుపత్రిని తరలిస్తుండగా తుదిశ్వాస వదిలారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. పదేళ్ల క్రితం తమ కుటుంబసభ్యుల్ని చంపినందుకు ప్రతీకారంగా.. ఆ దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేలింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Prachhaya Lunar Eclipse Live: ప్రచ్ఛాయ చంద్రగ్రహణం.. ఏంచేయాలో తెలుసా?

మొరేనాకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేపా గ్రామంలో.. ధీర్ సింగ్, గజేంద్ర సింగ్ అనే రెండు కుటుంబాలు ఉన్నాయి. ఈ రెండు కుటుంబాల మధ్య ఆస్తుల విషయంలో ఎప్పటినుంచో శతృత్వం ఉంది. ఇందులో భాగంగానే.. 2013లో ధీర్ సింగ్ కుటుంబంలోని ఇద్దరు వ్యక్తుల్ని గజేంద్ర సింగ్ కుటుంబీకులు చంపారు. అప్పటి నుంచి ఆ రెండు ఫ్యామిలీల మధ్య శతృత్వం తారాస్థాయికి చేరుకుంది. గజేంద్ర సింగ్ కుటుంబంపై పగ పెంచుకున్న ధీర్ సింగ్ కుటుంబీకులు.. ప్రతీకారం తీర్చుకోవడం కోసం సరైన సమయం కోసం వేచి చూశారు. ఈ కేసు విచారణ కొన్ని సంవత్సరాల వరకు కొనసాగింది. చివరికి గజేంద్ర సింగ్ ఫ్యామిలీ మెంబర్స్‌కు జైలుశిక్ష పడటంతో.. వాళ్లు నాలుగైదేళ్లు జైలుశిక్ష అనుభవించారు. ఈ శుక్రవారమే వాళ్లు జైలు నుంచి విడుదల అయ్యారు.

Minister KTR : బీఆర్‌ఎస్ అంటే భారత్ రైతు సమితి

ఈ విషయం తెలుసుకున్న ధీర్ సింగ్ కుటుంబీకులు.. ఇదే సరైన సమయమని భావించి, తుపాకులు తీసుకొని వారిపై కాల్పులకు తెగబడ్డారు. శుక్రవారం ఉదయం 9:30 – 10:00 గంటల మధ్య వాళ్లు కాల్పులు జరిపారు. వీరిని అడ్డుకోవడానికి మహిళలు చెక్క కర్రల్ని విసిరారు. అయితే.. వాళ్లు వెనక్కు తగ్గకుండా కాల్పులు జరపగా, ఆరుగురు హతమయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కాల్పులకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మిగతా ఐదుగురి కోసం గాలిస్తున్నారు. పాత కక్షల వల్లే ఈ కాల్పులు జరిగినట్టు తేలిందని పోలీసులు తెలిపారు.

Show comments