Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు హల్దీ వాగులో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒక శుభకార్యానికి హాజరై, ఆ సంతోషాన్ని పంచుకోవాల్సిన యువకులు విగతజీవులుగా మారడంతో వారి కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన ప్రశాంత్ (27), వికాస్ (27), ఆనంద్ రెడ్డి (27) అనే ముగ్గురు స్నేహితులు బుధవారం నాడు మెదక్ జిల్లా తూప్రాన్‌లో జరిగిన ఒక పెళ్లి వేడుకకు హాజరయ్యారు. వివాహ వేడుక అనంతరం, గురువారం ఉదయం తిరుగు ప్రయాణంలో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం సమీపంలోని హల్దీ వాగు వద్దకు చేరుకున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. సరదాగా వాగులో ఈత కొట్టాలని నిర్ణయించుకున్నారు.
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
వాగులోకి దిగిన ఈ ముగ్గురు స్నేహితులకు నీటి లోతుపై అవగాహన లేకపోవడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గల్లంతైన యువకుల కోసం స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం పోలీసులు మరియు గజ ఈతగాళ్ల సహాయంతో గాలించగా.. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులంతా ఒకే వయసు వారు (27 ఏళ్లు) కావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కుటుంబాల్లో విషాదం..
ఒకే ఊరికి చెందిన ముగ్గురు యువకులు, అందులోనూ ప్రాణ స్నేహితులు ఇలా ఒకేసారి మృతి చెందడంతో నర్సాపూర్‌లో విషాదం నెలకొంది. పెళ్లికి వెళ్లి వస్తామని చెప్పిన కొడుకులు శవాలై రావడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జలాశయాలు, వాగుల వద్దకు వెళ్లేటప్పుడు యువత అప్రమత్తంగా ఉండాలని, నీటి లోతు తెలియకుండా లోపలికి వెళ్లడం ప్రాణాంతకమని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.
తాజావార్తలు
-
Nora Fatehi : జైలర్2లో స్పెషల్ సాంగ్.. అందాల విందు చేసి ఆరబోసిన నోరాఫతేహీ
-
Srikanth Odela: శ్రీకాంత్ ఓదెలపై నమ్మకం ఉంటుందా?.. నెక్ట్స్ హీరో ఎవరు?
-
Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్‌ప్లే
-
Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
-
BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. జీవోలు కొట్టివేత
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!