Site icon NTV Telugu

SI Suicide: తణుకులో ఎస్‌ఐ ఆత్మహత్య.. తుపాకీతో కాల్చుకొని..!

Si Suicide

Si Suicide

SI Suicide: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తుపాకీతో కాల్చుకొని సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్ఐ) మృతి చెందిన ఘటన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఈ రోజు చోటుచేసుకుంది. రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా పని పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి.. ఇటీవల పలు ఆరోపణలు నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. అయితే, ఈరోజు ఉదయం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆయన.. తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు.. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఎస్సై ఏజీఎస్‌ మూర్తి మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఇటీవల వీఆర్‌లో ఉన్న ఎస్సై మూర్తి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.. కుటుంబ సమస్యలా? వ్యక్తిగత కారణాలా? లేదా సస్పెండ్‌ అయ్యానని అవమానంతో ప్రాణాలు తీసుకున్నాడా? అనే కోణంలో విచారణ చేపట్టారు తణుకు పోలీసులు.. రూరల్ ఎస్సై సొంత ఊరు దాక్షారామం వద్ద గంగవరం.. కాగా, ఒక బాబు, పాప ఉన్నారు.. ఇక, తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి.. ఎస్సై ఆత్మహత్యకు గల కారణాలపై వివరాలు సేకరించారు.

Read Also: SSMB 29: మహేష్ కోసం ప్రియాంకని దింపడం వెనుక ఇంత స్కెచ్ ఉందా ?

Exit mobile version